MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అసుర హననం, మనలోని పౌరుషం.. `హరిహర`లోని పాటని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

అసుర హననం, మనలోని పౌరుషం.. `హరిహర`లోని పాటని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

ఎంఎం కీరవాణి `హరిహర వీరమల్లు` మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులోని రెండో పాట `అసుర హననం`ని బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ పాట విన్న పవన్‌ కళ్యాణ్‌ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 20 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుధవారం `అసుర హననం` పాట విడుదల
Image Credit : Asianet News

బుధవారం `అసుర హననం` పాట విడుదల

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా `హరిహర వీరమల్లు` మూవీ రూపొందుతుంది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. వచ్చే నెలలో సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

అయితే ఈ మూవీలోని రెండో పాటని `అసుర హననం`ని రేపు బుధవారం(మే 21)న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో పవన కళ్యాణ్‌ని కలిశారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి. ఈ సందర్భంగా రేపు విడుదల చేయబోతున్న పాట గురించి పవన్ కి వివరించారు. వినిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాట విని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు
Image Credit : Asianet News

పాట విని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

పాట విన్న పవన్‌ .. కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఆయన్ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, `మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు` అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే...’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి.

 ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు.

35
కీరవాణిలోని తపన చూసి ఆశ్చర్యమేసిందిః పవన్‌
Image Credit : Asianet News

కీరవాణిలోని తపన చూసి ఆశ్చర్యమేసిందిః పవన్‌

`హరిహర వీరమల్లు` చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. 

‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే... అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది.

45
నేను వయోలిన్‌ నేర్చుకున్న రోజులు గుర్తొచ్చాయిః పవన్‌
Image Credit : Asianet News

నేను వయోలిన్‌ నేర్చుకున్న రోజులు గుర్తొచ్చాయిః పవన్‌

ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. 

కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు.. నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తుకు వచ్చింది. చిదంబరనాథన్ ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి.

55
32 కథలతో కీరవాణి సంకలనం
Image Credit : our own

32 కథలతో కీరవాణి సంకలనం

తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. 

ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు... చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు.

 సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు` అంటూ కీరవాణిపై డిప్యూటీ సీఎం పవన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వీరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు కూడా ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
తారక్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్, నాగచైతన్యతో కలిసి ఆ క్లాసిక్‌ మూవీ రీమేక్‌.. చేస్తే రచ్చ రచ్చే
Recommended image2
`వార్ 2` టీజర్: నా గురించి నీకు తెలియదు, హృతిక్‌కి ఎన్టీఆర్‌ వార్నింగ్‌.. 1000 కోట్ల మూవీ లోడింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved