MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Entertainment News
  • తారక్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్, నాగచైతన్యతో కలిసి ఆ క్లాసిక్‌ మూవీ రీమేక్‌.. చేస్తే రచ్చ రచ్చే

తారక్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్, నాగచైతన్యతో కలిసి ఆ క్లాసిక్‌ మూవీ రీమేక్‌.. చేస్తే రచ్చ రచ్చే

ఎన్టీఆర్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ని బయటపెట్టారు. నాగచైతన్యతో కలిసి ఓ క్లాసిక్‌ మూవీని రీమేక్‌ చేయాలని ఉందట. అలాగే తాతగారి సినిమాల్లో ఆ మూవీ రీమేక్‌ చేస్తానని తెలిపారు. 

Aithagoni Raju | Published : May 20 2025, 07:35 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
నాగచైతన్యతో ఎన్టీఆర్‌ రీమేక్‌ ప్లాన్‌
Image Credit : google

నాగచైతన్యతో ఎన్టీఆర్‌ రీమేక్‌ ప్లాన్‌

ఎన్టీఆర్‌ నేడు(మే 20) తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో అభిమానుల నుంచి హడావుడి ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్, సినిమా సెలబ్రిటీలు విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. తారక్‌ తన పుట్టిన రోజుని తన ఫ్యామిలీతోనే సెలబ్రేట్‌ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగ చైతన్యతో రీమేక్‌ కి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది.

25
తాతగారి `దాన వీర శూర కర్ణ` రీమేక్‌ చేయాలనేది డ్రీమ్‌
Image Credit : Social Media

తాతగారి `దాన వీర శూర కర్ణ` రీమేక్‌ చేయాలనేది డ్రీమ్‌

తారక్‌ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ లు ప్రకటించారు. తెలుగులో తాను రీమేక్‌ చేయాలనుకుంటున్న సినిమాలేంటో వెల్లడించారు. తాతగారి సినిమాలు రీమేక్‌ చేయాల్సి వస్తే `దానవీర శూర కర్ణ` రీమేక్‌ చేస్తానని, తాతగారిలా చేయడం కష్టం అని, కానీ తనకు ఈ మూవీ రీమేక్‌ చేయాలనేది డ్రీమ్‌ అన్నారు.

Related Articles

ఎన్టీఆర్‌ ఏడాదికి రెండు సార్లు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు ఎందుకో తెలుసా? తెరవెనుక పెద్ద విషాదం
ఎన్టీఆర్‌ ఏడాదికి రెండు సార్లు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు ఎందుకో తెలుసా? తెరవెనుక పెద్ద విషాదం
పదేళ్లలో ఎన్టీఆర్‌ సినిమాలు, టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యంకాని సక్సెస్‌ రేట్‌
పదేళ్లలో ఎన్టీఆర్‌ సినిమాలు, టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యంకాని సక్సెస్‌ రేట్‌
35
నాగ చైతన్యతో `గుండమ్మ కథ` రీమేక్‌ చేయాలనుందన్న తారక్‌
Image Credit : google

నాగ చైతన్యతో `గుండమ్మ కథ` రీమేక్‌ చేయాలనుందన్న తారక్‌

అంతేకాదు మరో డ్రీమ్‌ని ప్రకటించారు ఎన్టీఆర్‌. మల్టీస్టారర్‌ గురించి వెల్లడించారు. తాతగారు, ఏఎన్నార్‌ గారు కలిసి నటించిన `గుండమ్మకథ`ని కూడా రీమేక్‌ చేయాలని ఉందని ఆయన చెప్పారు. అయితే నాగచైతన్యతో కలిసి ఈ మూవీ రీమేక్‌ చేస్తే బాగుంటుందని, ఇది ఎప్పటికి కుదురుతుందో చూడాలి అన్నారు ఎన్టీఆర్‌. దాదాపు పదేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

45
`ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర`తో పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎన్టీఆర్‌
Image Credit : Social Media

`ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర`తో పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎన్టీఆర్‌

అప్పటికీ ఇప్పటికీ లెక్కలన్నీ మారిపోయాయి. ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర` చిత్రాలతో ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గ్లోబల్‌ స్టార్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల `తండేల్‌` తో విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య. ఇంకా పాన్‌ ఇండియా ఇమేజ్‌ చైతూకి రాలేదు. ఇలాంటి దశలో ఎన్టీఆర్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో `గుండమ్మ కథ`రీమేక్‌ సాధ్యమవుతుందా? దాన్ని రీమేక్‌ చేయగలిగే దర్శకులు ఉన్నారా? అనేది ప్రశ్న.

55
డిజప్పాయింట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌
Image Credit : Asianet News

డిజప్పాయింట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ వస్తుందని అందరు భావించారు. కానీ కేవలం విషెస్‌ పోస్టర్‌ వదిలింది టీమ్‌. దీంతోపాటు హిందీలో `వార్‌ 2`లో నటించారు తారక్. ఈ చిత్రం నుంచి టీజర్‌ వచ్చే అవకాశం ఉంది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories