Pawan Kalyan: పవన్ గేమ్ లో బలైన నిర్మాత?... అయోమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్!
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు చిక్కుల్లో పడింది. ఈ సినిమా బడ్జెట్ సమస్యల్లో చిక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో నిర్మాత ఏ ఎమ్ రత్నం సందిగ్ధంలో పడ్డారట.

pawan kalyan
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమ్ బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాల్లో హరి హర వీరమల్లు ఒకటి. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ మొదలై దాదాపు రెండేళ్లు దాటిపోయింది. కరోనా పరిస్థితుల కారణంగా కొంత కాలం సినిమా హోల్డ్ లో పడింది. అలాగే పవన్ నిర్ణయాలు ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. వకీల్ సాబ్ చిత్రం తర్వాత వెంటనే పవన్ హరి హర వీరమల్లు పూర్తి చేయాల్సి ఉంది. అయితే మధ్యలో పవన్ భీమ్లా నాయక్ తెరపైకి తెచ్చారు.
త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సూర్యదేవర నాగ వంశీ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్స్ సొంతం చేసుకున్నారు. బాలయ్య, వెంకటేష్ వంటి స్టార్స్ తో చేయాలని భావించాడు. త్రివిక్రమ్ చొరవతో ఈ మూవీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. తక్కువ డేట్స్ తో భీమ్లా నాయక్ (Bheemla Nayak) పూర్తి చేసే ఒప్పందంపై పవన్ రంగంలోకి దిగారు. దీంతో హరి హర వీరమల్లు డిలే అయ్యింది. పవన్ నిర్ణయాలు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నా అడగలేకపోతున్నారు.
Pawan Kalyan
చివరకు హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) బడ్జెట్ తడిసిమోపెడయ్యిందట. ఓ మూవీ మేకింగ్ డిలే అయ్యే కొద్దీ నిర్మాతపై భారం పెరిగిపోతుంది. వడ్డీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రెట్టింపు అవుతుంది. ఆచార్య మూవీ డిలే అవడంతో రూ. 50 కోట్లు వడ్డీ చెల్లించినట్లు చిరంజీవి తెలియజేశారు. ఆ క్రమంలో ఏఎం రత్నం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల క్రితమే పవన్ కి అడ్వాన్స్ ఇచ్చి మూవీ ఓకే చేస్తే.. ఆయనేమో మధ్యలో రీమేక్ లు చేస్తూ నిర్మాతల నడ్డి విరుస్తున్నాయి. రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం కొందరు దర్శక నిర్మాతలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాడు.
పవన్ దెబ్బకు హరి హర వీరమల్లు బడ్జెట్ అనుకున్నదానికి పొంతన లేకుండా పోతుందట. పట్టుమని 40 శాతం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుందట. హరి హర వీరమల్లు ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తుంది. అలాగే పవన్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ మూవీపై కూడా క్లారిటీ లేదు. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియడం లేదు. పవన్ గతంలో నిర్మాత ఏఎం రత్నంకి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ అభిమానంతో 2006లో బంగారం మూవీ చేశారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మరలా చాలా గ్యాప్ తర్వాత హరి హర వీరమల్లు మూవీ చేస్తున్నారు.
మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది ప్రణాళిక. ఇక పవన్ వినోదయ సిత్తం మూవీ రీమేక్ కి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తుండగా... ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో..