పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ విషయంలో నిరాశ తప్పేలా లేదుగా..
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీమియర్స్ లేకపోవడం మెగా ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించినా, స్పెషల్ షోలతో ‘ఓజీ’ హంగామా మరింతగా పెరగనుంది.

ఓజీపై భారీ అంచనాలు
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’(OG). ఈ మూవీ ఈ నెల సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కీలక పాత్ర పోషించగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
తమన్ మ్యూజిక్ తో హైప్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన మూడు సింగిల్స్ మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. ప్రత్యేకంగా ఫ్యాన్స్ “తమన్ ఈ సారి అనిరుధ్‌ను మించిపోయాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కి షాక్
స్టార్ హీరోల సినిమాలు విడుదల సందర్భంగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ పెట్టే ట్రెండ్ టాలీవుడ్‌లో బాగా హిట్ అయ్యింది. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయని అభిమానులు భావించారు. అయితే, మేకర్స్ తాజాగా క్లారిటీ ఇస్తూ ప్రీమియర్స్ లేవు అని ప్రకటించారు. కానీ, ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందకుండా స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 గంటకు, సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 4 గంటలకు OG స్పెషల్ షోలు వేయనున్నారు.
ప్రీమియర్స్ ఎందుకు లేవు?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఓజీ హైప్ చాలా ఎక్కువగా ఉండటంతో, ప్రీమియర్స్ వేయడం వల్ల ఏదైనా అల్లర్లు, సెక్యూరిటీ ఇష్యూలు తలెత్తే అవకాశం ఉందని మేకర్స్ భావించారని చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు కలిగే క్రేజ్ దృష్ట్యా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్
‘ఓజీ’పై క్రేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ సాక్ష్యం. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగానే లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయి. ప్రీమియర్ షోలకే కాకుండా, ప్రీ-సేల్స్‌లోనే రికార్డులు తిరగరాస్తూ ఓజీ (OG) భారీ బాక్సాఫీస్ స్టార్టు కోసం సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కే పండగ. కానీ ఈసారి ‘ఓజీ’ రిలీజ్‌కి ఉన్న హైప్ మాత్రం మరీ భిన్నంగా ఉంది. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు, ఫైర్వర్క్స్ తో థియేటర్స్‌ను ఫెస్టివల్ మూడ్‌లోకి మార్చేందుకు సిద్ధమవుతున్నారు.