ఓవర్సీస్ లో ఓజీ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు..
OG Movie: పవన్ కల్యాణ్ -సుజిత్ కాంబోలో తెరకెక్కిన ‘ఓజీ’ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు పది రోజులు ముందే 50,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో సేల్ అయ్యినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్
OG Movie: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' (OG Movie).'ఓజీ'కి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక్ మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఓవర్సీస్ లో 'ఓజీ' సెన్సేషన్.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ - యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఓజీ'. అమెరికాలో సంచలనాలు నమోదు చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘దే కాల్ హిమ్ OG’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.
సినిమా విడుదలకు పది రోజులు ముందే ఓజీ సినిమా 50,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో సేల్ అవ్వడం విశేషం. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టిక్కెట్స్ అమ్ముడుపోయిన తెలుగు సినిమాగా OG నిలిచింది. ఈ రికార్డ్‌తో సోషల్ మీడియాలో అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా ముందు రోజే (సెప్టెంబర్ 24న) అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
Records keep falling… the OG of Box Office keeps rising 😎🔥
ALL TIME FASTEST……#OG#TheyCallHimOGpic.twitter.com/ALUouxjJ0A— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్స్
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. కేవలం వారం రోజుల్లో సినిమా విడుదల కానునడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం వరుస సర్‌ప్రైజ్‌లు ఇవ్వాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో రేపు ( సెప్టెంబర్ 15న) కొత్త పాటను రిలీజ్ చేయనున్నారు. అలాగే అఫీషియల్ ట్రైలర్ విడుదలకు కూడా మూవీ టీమ్ సిద్ధమవుతోంది.
#GunsNRoses 🔫🌹
A SURESHOT BLOCKBUSTER song dropping tomorrow at 4:50 PM 🎯💯 #OG#TheyCallHimOGpic.twitter.com/V8IWj9Tdbq— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
ప్రీ-రిలీజ్ ఈవెంట్?
తాజాగా సోషల్ మీడియాలో మరో అప్‌డేట్ హాట్ టాపిక్ అయింది. సెప్టెంబర్ 20న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని టాక్. ఇది నిజమైతే పవన్-చిరు అభిమానులకు పండగే. ఇక ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతుండగా... 19 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం.
బ్లాక్‌బస్టర్ కోసం రెడీ..
OG టీమ్ తాజాగా షూటింగ్ పూర్తిచేసిన సందర్భంగా ఒక ఫోటోను షేర్ చేసింది. “మా కష్టానికి ఫలితం సెప్టెంబర్ 25 నుంచి బ్లాక్‌బస్టర్ రూపంలో రానుంది” అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరోవైపు ఓజీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పవన్ కల్యాణ్ డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో 'ఓజాస్ గంభీర'గా పవన్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటూ మూవీ టీం చెబుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'ఓజీ'నే ట్రెండ్ కొనసాగుతోంది. మొత్తానికి ఓజీ సినిమాపై ఎక్కడ లేని హైప్స్ క్రియేట్ అయ్యాయి.
The picture we clicked with OG on the last day ❤️🔥
Cheers to our amazing men bringing FIREEEE to deliver the BLOCKBUSTER on screens from September 25th 💥#TheyCallHimOG#OGpic.twitter.com/e5hLrPguqq— DVV Entertainment (@DVVMovies) September 13, 2025