- Home
- Entertainment
- అల్లు ఫ్యామిలీకి అండగా చిరంజీవి.. ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్
అల్లు ఫ్యామిలీకి అండగా చిరంజీవి.. ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్
Mega-Allu Family Together: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం మరణించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం హైద్రాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

దుఖంలో అల్లు అరవింద్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో ఆమె దశదినకర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అల్లు ఫ్యామిలీకి అండగా చిరంజీవి
అల్లు కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరై, అల్లు అరవింద్‌ను పరామర్శించారు. అంతేకాదు, కనకరత్నమ్మ మరణ సమయంలో అల్లు అరవింద్ అందుబాటులో లేని సమయంలో చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన విషయం మరలా గుర్తుచేశారు.
అకీరా నందన్‌తో పవన్ కళ్యాణ్
అల్లు కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పాల్గొన్నారు. కనకరత్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ బిజీ షెడ్యూల్ మధ్య కుటుంబ కార్యక్రమానికి హాజరుకావడం ప్రత్యేకంగా నిలిచింది.
ఒకే ఫ్రేమ్ లో మెగా స్టార్స్
అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ తదితర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఇలా మెగా-అల్లు కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.