- Home
- Entertainment
- ఓజీ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ పై గర్జించే ఓజస్ గంభీర, నెవర్ బిఫోర్ యాక్షన్ తో పవన్ తాండవం
ఓజీ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ పై గర్జించే ఓజస్ గంభీర, నెవర్ బిఫోర్ యాక్షన్ తో పవన్ తాండవం
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర ప్రీమియర్ షోల పడ్డాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? అంచనాలని ఈ మూవీ అందుకునే స్థాయిలో ఉందా ? అనే విషయాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

ఓజీ ట్విట్టర్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఓజీ మ్యానియాతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓజీ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. అభిమానులే కాదు సెలెబ్రిటీల్లో సైతం ఓజీ క్రేజ్ కనిపిస్తోంది. హైవోల్టేజ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంతటి హైప్ తో బుధవారం సెప్టెంబర్ 24న ఓజీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. థియేటర్స్ వద్ద హంగామా ఆకాశాన్ని తాకుతోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా ఈ చిత్రంలో నటించారు. శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. అభిమానులు నిరీక్షిస్తున్న సమయం రానే వచ్చింది. థియేటర్ల వద్ద దద్దరిల్లే హంగామాతో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. మరి అంచనాలు తగ్గట్లుగా ఓజీ మూవీ ఉందా, పవన్ ఈసారైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది
154 నిమిషాల నిడివితో ఓజీ చిత్రం ప్రారంభం అవుతుంది. ముందుగా 1940 కాలంలో సన్నివేశాలతో కథ మొదలవుతుంది. జపాన్ లో కొన్ని యుద్ధ సన్నివేశాలు చూపిస్తారు. సమురాయ్, మాఫియా గ్యాంగ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉంటాయి. యంగ్ పవన్ కళ్యాణ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అండతో మాఫియా గ్యాంగ్ ఎదుగుతుంది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ పై విలన్ కన్ను పడుతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. డైరెక్టర్ సుజీత్ ఓజీపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రతి సీజ్ ని డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్రెట్ కంటైనర్ చుట్టూ కథ సాగుతుంది.
యాక్షన్ సీన్స్ లో పవన్ విశ్వరూపం
కీలకమైన దశల్లో యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం ప్రదర్శించారు. యాక్షన్ సీన్స్ లో పవన్ చేసే విధ్వంసానికి అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం చాలా స్టైలిష్ గా ఉంటుంది. మధ్యలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ లవ్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలు వస్తాయి. అక్కడ ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ మూమెంట్ అనే చెప్పాలి. తిరిగి కథ ఇంటర్వెల్ కి సమీపించే కొద్దీ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇమ్రాన్ హష్మీ కూడా ఎంట్రీ ఇస్తారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్
ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్ అయితే టెర్రిఫిక్ గా ఉంటుంది. అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే.. ఇంటర్వెల్ సీన్ తో గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ముందు నుంచి చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సీన్ లో బ్లడ్ బాత్ సృష్టించారు. ఓవరాల్ గా ఓజీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గకుండా సుజీత్ మ్యాడ్ స్టఫ్ అందించారు. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. దానికి తగ్గట్లుగా తమన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లారు. ఇంటర్వెల్ సన్నివేశం అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అంటూ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.
ఎమోషనల్ గా సెకండ్ హాఫ్
సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో మొదలవుతుంది. ఓజీ ముంబై తిరిగి వచ్చాక ఇమ్రాన్ హష్మీ ఫేస్ ఆఫ్ సన్నివేశాలు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి సన్నివేశాలు కీలకంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ సుజీత్ ఎక్కువగా ఎలివేషన్ సీన్లకే ప్రాధ్యానత ఇచ్చారు. దీనితో అక్కడక్కడా కొన్ని డల్ మూమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ కాస్త లెన్తీగా ఉంటుంది. ఓవరాల్ గా ఓజీ మూవీ అద్భుతమైన ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్ అన్నట్లుగా ఉంటుంది. సినిమా మొత్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఎపిసోడ్స్ ని సుజీత్ పక్కాగా వర్కౌట్ చేశారు. టెక్నికల్ గా ఓజీ మూవీ బ్రిలియంట్ గా ఉంది.