MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అల్లరి రాముడు నుంచి వార్ 2 వరకు.. సూపర్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ చేసిన ప్రతిసారీ ఏమైందో తెలుసా

అల్లరి రాముడు నుంచి వార్ 2 వరకు.. సూపర్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ చేసిన ప్రతిసారీ ఏమైందో తెలుసా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. సూపర్ హిట్ డైరెక్టర్లతో తారక్ వర్క్ చేసిన ప్రతిసారి డిజాస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ చిత్రాలు ఏంటి ? ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Sep 24 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఎన్టీఆర్ కెరీర్ లో బ్యాడ్ సెంటిమెంట్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ కెరీర్ లో బ్యాడ్ సెంటిమెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వార్ 2 మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ డ్రాగన్ పైనే ఉన్నాయి. ఎన్టీఆర్ కి తన కెరీర్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. సూపర్ హిట్ డైరెక్టర్ తో సినిమా చేసిన ఎక్కువసార్లు తారక్ కి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. అల్లరి రాముడు నుంచి మొన్న రిలీజైన వార్ 2 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎన్టీఆర్ సూపర్ హిట్ డైరెక్టర్లతో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లాపులు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అల్లరి రాముడు 
Image Credit : Asianet News

అల్లరి రాముడు 

 ఆది లాంటి సంచలన మాస్ హిట్ తో ఆ టైంలో ఇండస్ట్రీలో తారక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో డైరెక్టర్ బి గోపాల్ నరసింహ నాయుడు చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. నరసింహ నాయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ టైంలో టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ లో బి గోపాల్ అగ్ర  స్థానంలో ఉన్నారు. అలాంటి టైంలో ఎన్టీఆర్, బి గోపాల్ కాంబినేషన్ లో సినిమా పడితే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నరసింహ నాయుడు లాంటి మూవీ తర్వాత బి గోపాల్ నుంచి ఇలాంటి మూవీని ఫ్యాన్స్ అస్సలు ఆశించలేదు. 

38
ఆంధ్రావాలా 
Image Credit : Asianet News

ఆంధ్రావాలా 

టాలీవుడ్ చరిత్రలో మాసివ్ హైప్ తో వచ్చిన చిత్రాల్లో ఆంధ్రావాలా కూడా ఒకటిగా ఉంటుంది. అంతకు ముందు పూరి జగన్నాధ్ ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన శివమణి మూవీ యావరేజ్ గా నిలిచింది. కానీ పూరి స్టామినాపై ఎవరికీ డౌట్ లేదు. ఎన్టీఆర్ తో పూరి తెరకెక్కించే తొలి చిత్రం ఆంద్రావాలా ఇండస్ట్రీ రికార్డులు తిరిగరాస్తుంది అని అంతా భావించారు. కానీ ఆంధ్రావాలా మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. 

48
అశోక్ 
Image Credit : Asianet News

అశోక్ 

టాలీవుడ్ లో మాస్ చిత్రాలని స్టైలిష్ గా తెరకెక్కించే దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. 2005 లో అతనొక్కడే చిత్రంతో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తన సోదరుడికి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. అతనొక్కడే తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశ పరిచింది. 

58
ఊసరవెల్లి 
Image Credit : Asianet News

ఊసరవెల్లి 

 అశోక్ తర్వాత సురేందర్ రెడ్డికి మరోసారి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ఊసరవెల్లి. అంతకు ముందే సురేందర్ రెడ్డి కిక్ లాంటి సూపర్ హిట్ చిత్రంతో మంచి జోష్ లో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబోలో ఒక ఫ్లాప్ ఉంది. దీనితో సురేందర్ రెడ్డి ఈసారి ఎలాగైనా కసిగా వర్క్ చేసి ఎన్టీఆర్ కి హిట్ ఇస్తారు అని తారక్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈసారి కూడా రిజల్ట్ మారలేదు. ఊసరవెల్లి కూడా ఫ్లాప్ అయింది. 

68
దమ్ము 
Image Credit : Asianet News

దమ్ము 

వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా లాంటి మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ మూవీతో బాలయ్య విజయాల దాహం తీరింది. సింహా తర్వాత బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో జతకట్టారు. రిలీజ్ కి ముందు దమ్ము చిత్రానికి ఊహించని హైప్ వచ్చింది. మాస్ చిత్రాలు తీసే బోయపాటి ఎన్టీఆర్ ని ఇంకెత మాస్ గా చూపిస్తారో అని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ దమ్ము కూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్ డిస్సప్పాయింట్మెంట్ గా మారిపోయింది. 

78
రామయ్య వస్తావయ్యా 
Image Credit : Asianet News

రామయ్య వస్తావయ్యా 

పదేళ్ల పాటు హిట్ కోసం ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మెమొరబుల్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కి ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా. ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

88
వార్ 2 
Image Credit : Asianet News

వార్ 2 

ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం వార్ 2. కనీవినీ ఎరుగని హైప్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రానికి ముందు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. కానీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లని పెట్టి తీసిన వార్ 2 మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే
Recommended image2
అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు, లిస్ట్ లో ఉన్న ఏకైక తెలుగు మూవీ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved