ఓజీ కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బడ్జెట్ లో సంగం ఎగిరిపోయిందిగా
Pawan Kalyan Remuneration : ఓజీ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు పవర్ స్టార్. అయితే ఈసినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

రిలీజ్ కు రెడీగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ (OG)’ ఈ నెలలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మరి ఆ టైమ్ కు రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ సినిమాతో తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్, ఈసారి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమాతో మళ్లీ తన అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఈక్రమంలో ఓజీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాడు. ఇక ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. తాజాగా ఈసినిమా ఫైనల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమాలో పవన్ కళ్యాణ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్న న్యూస్ ప్రకారం పవన్ కెరీర్‌లోనే ఇది హైయోస్ట్ రెమ్యునరేషన్ అని అంటున్నారు. కాని దీని గురించి అఫీషియల్ గా మాత్రంఎటువంటి సమాచారం లేదు.
ఫ్యాన్స్ ఎదురు చూపులు
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలతో సుజీత్ నిరూపించుకున్న నేపథ్యంలో, ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి ఆడియన్స్ లో ఉంది. అంతే కాదు పవర్ స్టార్ పవన్ ను డిఫరెంట్ లుక్ లో చూపించబోతుండటం, ఈసినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ కూడా ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చడంతో, ఓజీ గురించి ఇంకాస్త ఆసక్తి పెరిగిపోయింది. ఈసినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో
ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్, యాక్షన్ సీన్లు, లవ్ ట్రాక్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.