MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్... ఇండస్ట్రీలో సత్యానంద్ శిష్యులు ఎంత మంది ఉన్నారో తెలుసా?

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్... ఇండస్ట్రీలో సత్యానంద్ శిష్యులు ఎంత మంది ఉన్నారో తెలుసా?

టాలీవుడ్ టాప్ హీరోలుగా ప్రస్తుతం అలరిస్తున్న పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి నటనలో శిక్షణ ఇచ్చింది ఎవరు? ఆయన స్టూడెంట్స్ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 07 2023, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆయన దగ్గర శిక్షణ పొందితే స్టార్స్ అవ్వడం ఖాయం.. వాచకం, ఆహారం, అభినయంలో అనువనువు అవపోషణ పట్టిన గురువు వద్ద మన టాలీవుడ్ స్టార్ హీరోలు శిక్షణ పొందారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తాను చాటుతున్నారు. ఇంతకీ మనహీరోలకు శిక్షణ ఇచ్చింది ఎవరో కాదు... నటుడు, స్టార్ మేకర్, సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సత్యానంద్ (Satyanand) . ఆయన దగ్గరే దాదాపుగా మన స్టార్స్ శిక్షణ పొందారు. 

26

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను యాక్టిగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి సత్యానంద్ ఇన్ స్టిట్యూట్ లో చేర్పించారు. అదే సమయంలో మహేశ్ బాబు (Mahesh babu)ను దివంగత సూపర్ స్టార్ కృష్ణ శిక్షణ కోసం పంపించారంట. ఇద్దరూ శిక్షణలో తొలుత ఇబ్బంది పడేవారంట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేత ప్రాక్టీస్ చేయించడానికి ఎక్కువ కష్టపడ్డట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత పవన్, మహేశ్ ఎలాంటి అద్భుతాలు సృష్టించారో తెలిసిందే. 

36

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రీసెంట్ గానే సత్యానంద్ ను కలిశారు. తనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువుకు బంగారు బ్రాస్లెట్ అందించి గౌరవించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కృష్ణం రాజు డార్లింగ్ ను సత్యానంద్ దగ్గరకు శిక్షణకు పంపించారు. ఇప్పటికీ ప్రభాస్ సత్యానంద్ కు వారంలో ఒకసారైనా కాల్ చేసిన మాట్లాడుతుంటారంట. 

46

‘సింధూరం’తో కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్దరు హీరోలు కూడా సత్యానంద్ వద్దనే శిక్షణ తీసుకున్నారు. అయితే ‘సింధూరం’లో రవితేజ నటన చూసిన కృష్ణవంశీ మరింత శిక్షణ కోసం సత్యానంద్ వద్దకు పంపించారంట. ఆ తర్వాత రవితేజ మాస్ రాజా ఎదిగినా తీరు తెలిసిందే. ఇప్పటికీ బ్రహ్మాజీ కీలక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. 

56

యంగ్ హీరోలు శర్వానంద్, పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్, ఆది సాయి కుమార్ కూడా సత్యానంద్ వద్దే శిక్షణ పొందారు. సాయిరామ్ శంకర్ మినహా వారిద్దరూ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు. 

66

తమిళ నటులు జయం రవి, తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న హీరో ఆది పినిశెట్టి కూడా సత్యానంద్ శిష్యులే. ప్రస్తుతం జయం రవి తమిళంలో భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటు ఆది కూడా కెరీర్ లో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇక సత్యానంద్ శిష్యుల్లో బ్రహ్మనందం కొడుకు గౌతమ్, వైభవ్ తదితరు ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు సత్యానంద్ 450 మందికి పైగా దగ్గరుండి తానే శిక్ష ఇచ్చారు. ఇందులో 20కిపైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండటం విశేషం. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే
Recommended image2
Balakrishna: సింహం నవ్వడమేంటి? పిచ్చి కాకపోతే.. తండ్రి ఎన్టీఆర్‌తో చేసిన సినిమాపైనే బాలయ్య సెటైర్లు
Recommended image3
Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved