- Home
- Entertainment
- ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆఫ్ స్క్రీన్ మ్యారేజ్... హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు!
ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆఫ్ స్క్రీన్ మ్యారేజ్... హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు!
సౌత్ ఇండియాలో పలువురు హీరోలు తమతో కలిసి నటించిన హీరోయిన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. మరి హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్న హీరోలు ఎవరో చూద్దాం...

Heroes who married their heroines
ప్రేమ విశ్వజనీనం. ఎప్పుడు ఎవరితో పుడుతుందో చెప్పలేం. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కురిపించిన హీరోలు-హీరోయిన్స్ నిజంగానే ప్రేమలో పడిపోయారు. పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. తమతో జతకట్టిన హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్న హీరోలు ఎవరో చూద్దాం...
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడిపోయాడు. వంశీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడాకుల తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. బద్రి మూవీ సెట్స్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. రేణుకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ డాన్సర్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు.
హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ఇప్పటి వరకు ఏడు చిత్రాల్లో కలిసి నటించారు. జ్యోతికను సూర్య ప్రేమ వివాహం చేసుకోగా ఇద్దరు సంతానం.
రాజశేఖర్-జీవిత అంకుశం, ఆహుతి వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పుడే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం.
అక్కినేని నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మికి 1990లో విడాకులు ఇచ్చారు. తర్వాత శివ, నిర్ణయం, కిరాయి దాదా చిత్రాల్లో జంటగా నటించిన అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. అఖిల్ వీరి కుమారుడు.
అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు నాగ చైతన్య కూడా తనతో జతకట్టిన హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. 2018లో నాగ చైతన్య-సమంతల వివాహం జరిగింది. అయితే వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.
యంగ్ హీరో వరుణ్ తేజ్ తనతో జతకట్టిన వితిక షేరును వివాహం చేసుకున్నారు. కృష్ణ కూడా తన హీరోయిన్ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు. హీరో అజిత్ సైతం తన హీరోయిన్ షాలిని మెడలో తాళి కట్టాడు. హీరో ఆర్య తన హీరోయిన్ సాయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు.