- Home
- Entertainment
- `జల్సా` రీ రిలీజ్.. ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాకే.. ఇండియన్ రికార్డులు షేక్
`జల్సా` రీ రిలీజ్.. ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాకే.. ఇండియన్ రికార్డులు షేక్
ఒక్కసారి రిలీజ్ అయిన సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడమనేది చాలా అరుదు. కానీ ఇటీవల అది ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డేకి రిలీజ్ అయిన `జల్సా` సినిమా రికార్డులు షేక్ చేసింది.

స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ బెస్ట్ మూవీస్‌ని రిలీజ్ చేయడమనే ట్రెండ్ ఇటీవల ఊపందుకుంది. మహేష్ బర్త్ డే సందర్భంగా `పోకిరి` రిలీజ్ చేశారు. అది భారీగా ఆదరణ పొందింది. ప్రదర్శించిన అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. అప్పుడు కలెక్షన్లు మ్యాటర్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కొత్తగా మరో ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజుసందర్భంగా ఆయన సూపర్ హిట్లు `తమ్ముడు`(Thammudu), `జల్సా` (Jalsa) చిత్రాలను విడుదల చేశారు. మూడు రోజులపాటు ఈ చిత్రాల హంగామా సాగింది. `తమ్ముడు` విషయంలో పెద్దగా ప్రచారం జరగలేదు. అది పూర్తిగా ప్రైవేట్ వాళ్లు ప్రదర్శించారు. కానీ `జల్సా` సినిమాని ఫ్యాన్స్ ముందుండి స్పెషల్ షోస్ వేయించారు. ఈ సినిమా గురువారం సాయంత్రం నుంచి ప్రదర్శించగా, శుక్రవారం(సెప్టెంబర్ 2), ఈ రోజు కూడా కొన్ని షోస్ పడటం విశేషం.
తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా వసూలు చేసిన కలెక్షన్లని ప్రకటించింది యూనిట్. ఆ లెక్కలు(Jalsa Collections) మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఏకంగా ఈ సినిమా రూ.3.20కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఈ స్థాయిలో వసూలు రావడం టాలీవుడ్‌ని ఆశ్చర్యపర్చడంతోపాటు షాక్‌కి గురి చేస్తుంది. ఇటీవల కొత్త సినిమాలే ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. అలాంటిది రి రిలీజ్ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేయడం మైండ్ బ్లాక్ చేస్తుంది.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి అరుదైన సంఘటన జరగలేదు. ఇదొక ఇండియన్ సినిమాలోనే రికార్డుగా, సంచలనంగా అభివర్ణిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్‌ని, ఇమేజ్‌కి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు. కేవలం ఒకే రోజులో ఈ స్థాయి కలెక్షన్లు రావడం నిజంగా ఇదొక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాకోసం పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ టైమ్ విడుదలవుతున్న టైమ్‌లో ఎలాంటి కోలాహలం, రచ్చ ఉంటుందో, ఇప్పుడు కూడా అలానే ఉండటం, సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడటం విశేషం.
ఇక `జల్సా` సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, ఇలియానా కథానాయికగా నటించింది. కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్ ఇతర హీరోయిన్లుగా కనిపించారు. అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం 2008 ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పుడు కూడా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్ చెప్పే డైలాగులు, మ్యానరిజం హైలైట్‌గా నిలిచాయి.