ఒడ్డున పడ్డ జలకన్యలా... అరాకొరా దుస్తున్నతో పరువాల ప్రదర్శన చేస్తున్న పవన్ హీరోయిన్ నోరా!
సాగరం ఒడ్డున పడుకొని పరువాల విందు చేసింది నోరా ఫతేహి. చాలీ చాలని బట్టల్లో సాలిడ్ అందాలు చూపుతూ రెచ్చగొట్టింది. జలకన్య ఫోజుల్లో మతులు పోగొట్టింది.
Nora Fatehi
అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో నోరా ఫతేహి ఆఫర్ పట్టేశారు. పవన్ పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం.
Nora Fatehi
హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ ప్రధాన హీరోయిన్ అని సమాచారం. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. ఆమెది కేవలం వ్యాంప్ క్యారెక్టర్ కూడా కావచ్చనే వాదన ఉంది.
Nora Fatehi
హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్ లుక్ విడుదల చేశారు. అయితే నోరా ఫతేహి రోల్ గురించి చిత్ర యూనిట్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. హరి హర వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
Nora Fatehi
గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. హరి హర వీరమల్లు మూవీతో మరోసారి ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు .
కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు 15కి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.
ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోజులకు నోరా బాగా ఫేమస్. ఈ ఇంటర్నేషన్ ఫిగర్ ని ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.
ఖతార్ వేదికగా ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరిగింది. ఈ ఈవెంట్ ఫ్యాన్ క్లబ్ లో నోరా ఫతేహి పెర్ఫార్మ్ చేశారు. అలాగే వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో ఆడి పాడి ప్రపంచ వేదికపై క్రీడాభిమానులను అలరించారు.