MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • HHVM Review :ఫ్యాన్స్ కి హై ఇచ్చేలా యాక్షన్ ఇరగదీసిన పవన్.. వీరమల్లులో హైలైట్స్ ఇవే, ట్విటర్ రివ్యూ ఇదిగో

HHVM Review :ఫ్యాన్స్ కి హై ఇచ్చేలా యాక్షన్ ఇరగదీసిన పవన్.. వీరమల్లులో హైలైట్స్ ఇవే, ట్విటర్ రివ్యూ ఇదిగో

భారీ అంచనాలతో విడుదలైన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఉందా, పవన్ నటించిన తొలి పీరియాడిక్ చిత్రం ఆకట్టుకుందా అనే అంశాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 24 2025, 01:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : X/Hari Hara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటించిన పీరియాడిక్ చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగిసింది. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్నారు. మిగిలిన చిత్రాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఏఎం రత్నం ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ తో నిర్మించిన చిత్రం ఇదే. ఐదేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోహినూర్ డైమండ్, మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు పాలన లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం కావడం, ట్రైలర్, సాంగ్స్ కి టెరిఫిక్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : X/Hari Hara Veeramallu

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ట్విట్టర్ లో ఈ చిత్ర టాక్ ఎలా ఉంది లాంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1650 ఎడి సమయంలో కొల్లూరు మైన్ ప్రాంతంలో కథ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కుస్తీ ఫైట్ సన్నివేశాలని దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపిస్తూ కథ మొదలవుతుంది. 

36
Image Credit : X/Hari Hara Veeramallu

పవన్ ఎంట్రీ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత సునీల్, నాజర్, సుబ్బరాజు పాత్రలు కూడా పరిచయమవుతాయి. యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ కాన్సెప్ట్ ని చక్కగా డ్రైవ్ చేస్తూ మధ్యలో గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు. ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో చెలరేగిపోయినట్లు తెలుస్తోంది. 

46
Image Credit : X/Hari Hara Veeramallu

ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కుస్తీ ఫైట్ సన్నివేశం, పులి మేక ఎపిసోడ్, కొల్లగొట్టినాది రో సాంగ్, చార్మినార్ ఫైట్ సీక్వెన్ హైలైట్ గా నిలిచాయి. నిధి అగర్వాల్ పాత్రలో వచ్చే ట్విస్ట్ బావుంటుంది. కొన్ని సన్నివేశాల్లో కథ నెమ్మదించడం మైనస్ అనే చెప్పాలి. 

56
Image Credit : X/Hari Hara Veeramallu

సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ తన మిషన్ మొదలు పెడతారు. సెకండ్ హాఫ్ లో వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ఆయా సన్నివేశాలు కొంత సాగదీసినట్లు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ 20 నిమిషాల తర్వాత మళ్ళీ జోరందుకుంటుంది. సిజి వర్క్ కూడా అక్కడక్కడా మైనస్ గా నిలిచింది. 

66
Image Credit : X/Hari Hara Veeramallu

ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా యాక్షన్ మోడ్ లోకి వెళుతుంది. కీరవాణి పవర్ ఫుల్ బీజియంతో సన్నివేశాలని ఎలివేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది. ఫస్ట్ హాఫ్ లో మైంటైన్ చేసిన టెంపోని సెకండ్ హాఫ్ లో కూడా కొనసాగించి ఉంటే మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉండేది. ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ 5 ఏళ్ళు పడ్డ కష్టానికి మంచి ఫలితమే దక్కుతుంది అని అంటున్నారు. సెకండ్ హాఫ్ కాస్త తగ్గడం నిరాశ కలిగించే అంశం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Related Stories
Recommended image1
దిక్కు తోచని స్థితిలో పవన్ కళ్యాణ్ గురువు, చిరంజీవి ఏం చేశారో తెలుసా.. టాలీవుడ్ చరిత్ర మారిపోయింది
Recommended image2
కోట శ్రీనివాసరావుని తొక్కడానికి కొంతమంది నన్ను పావుగా వాడుకున్నారు.. ఇంటికెళ్లి మరీ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved