- Home
- Entertainment
- హరిహర వీరమల్లులో పవన్ ఇంట్రో సీన్, నిధి అగర్వాల్ పాత్ర డీటెయిల్స్ లీక్.. గూస్ బంప్స్ గ్యారెంటీ
హరిహర వీరమల్లులో పవన్ ఇంట్రో సీన్, నిధి అగర్వాల్ పాత్ర డీటెయిల్స్ లీక్.. గూస్ బంప్స్ గ్యారెంటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అంతే కాదు పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం కూడా ఇదే. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అంతే కాదు పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం కూడా ఇదే. మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంతవరకు ఆ హడావిడి మొదలు కాలేదు. అయితే ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర విషయాలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ పాత్ర గురించి కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. మరికొన్ని మరికొన్ని సంగతులని నిధి అగర్వాల్ స్వయంగా చెప్పారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తోంది. తన పాత్ర కేవలం పాటలు, గ్లామర్ కి పరిమితం కాదని చెబుతోంది. ఆమెకి ఒక లక్ష్యం ఉంటుందట.
ఒక లక్ష్యంతో కోటలోకి ప్రవేశించిన నిధి అగర్వాల్ అక్కడే చిక్కుకుపోతుంది. ఆ తర్వాత పవన్ రావడంతో అతడి సాయంతో కోట నుంచి బయటపడుతుందట. ఇంతకీ నిధి అగర్వాల్ లక్ష్యం ఏంటి అనేది సస్పెన్స్. ఈ మూవీ లో పవన్ గజదొంగ గా నటిస్తున్నారు.
Nidhhi Agarwal
పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెబుతున్నారు. మురళి శర్మకి చెందిన వజ్రాల ఓడపై పవన్ చెప్పి మరీ అటాక్ చేస్తాడట. అక్కడ జరిగే ఫైట్ సన్నివేశం మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.