- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ - క్రిష్ మధ్య విభేదాలు నిజమేనా ..? ఇక హరిహర వీరమల్లు సినిమా ఆగినట్టేనా..?
పవన్ కళ్యాణ్ - క్రిష్ మధ్య విభేదాలు నిజమేనా ..? ఇక హరిహర వీరమల్లు సినిమా ఆగినట్టేనా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు డైరెక్టర్ క్రిష్ కుమధ్య మనస్పర్థలు వచ్చాయా..? హరిహర వీరమల్ల షూటింగ్ ఆలస్యానికి కారణాలేంటి..? అసలు ఈసినిమా షూటింగ్ ఉంటుందా..? లేక ఆగిపోయినట్టేనా..? అసలేం జరుగుతోంది.. ? ఆడియన్స్ లో నెలకొన్న కన్ ఫ్యూజన్ కు కరణమేంటి..?

ఓ వైపు సినిమాలతోపాటు గా మరోవైపు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు రాజకీయంగా పరిస్థితులు మారుతున్న వేళ జనసేన పార్టీని ఎలాగైనా గాడిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే.. ఇటు సినిమాల విషయంలో కూడా అడుగులు వేస్తున్నారు.రెండింటికి టైమ్ కేటాయిస్తున్నారు.
ఈసారి ఎలక్షన్ లో క్రియాశీలకం అవ్వాలని చూస్తున్నారు పవన్ ఎన్నికల సమయం ఇంకా రెండు ఏళ్లు ఉండగానే.. ప్లానింగ్ రెడీ చేసేస్తున్నారు. అక్టోబర్ నుంచి ఏపీలో పవన్ బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన సైన్ చేసిన సినిమాల ప్రోడ్యూసర్లు మాత్రం ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు.
పవర్ స్టార్ సినిమా ప్రాజెక్ట్స్ లో కొన్ని ప్రపోజల్ దశలో ఉండగా.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాను అని పవన్ మాట ఇచ్చినా... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవర్ స్టార్ అవి కూడా కంప్లీట్ చేసేట్టు కనిపించడం లేదు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే.. పవర్ స్టార్ చేస్తున్నప్రాజెక్ట్ లలో క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా ఉంది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపుగా రెండు సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉంది. ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఈ సినిమా షూటింగ్ చేస్తూ.. వచ్చాడు పవన్. అయితే ఈమూవీ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు లాస్ట్ ఫిబ్రవరిలో హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలా చూసుకున్నా.. ఇప్పటి వరకూ చాలా శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కాని సినిమా అస్సలు ముందు కదలడం లేదు. ఈ విషయంలో పవర్ స్టార్ కు డైరెక్టర్ క్రిష్ కు పడటం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సబంధించిన కొన్ని సీన్లను పవర్ స్టార్ మార్చమని చెప్పాడట. అయితే పవన్ చెప్పినట్లు దర్శకుడు క్రిష్ మార్పులు చేయడం లేదని.. దాంతో పవర్ స్టార్ కాస్త గట్టిగానే క్రిష్ ను మందలించినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినట్టు సమాచారం.
ఈ విషయంలో పవర్ స్టార్ దర్శకుడి పై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులు చేసే వరకు షూటింగ్ కు రానని తెగేసి చెప్పారట. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే.. కాస్త వెచి చూడాల్సిందే.