పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసా ?
Pawan Kalyan First wife : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి పర్సనల్ లైఫ్ పై అనేక వివాదాలు వినిపించాయి.

Pawan Kalyan, Nandini
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి పర్సనల్ లైఫ్ పై అనేక వివాదాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయితో జరిగింది. పవన్ కళ్యాణ్ 26 ఏళ్ళ వయసులో 19 ఏళ్ళ నందిని వివాహం చేసుకున్నారు. నందిని వైజాగ్ కి చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తె. మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండడంతో పెద్దలు వీరిద్దరి పెళ్లి కుదిర్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్, నందిని వివాహం 1997లో ఘనంగా జరిగింది. కానీ రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు. దీనితో నందిని పవన్ కళ్యాణ్ పై కోర్టులో కేసు వేశారు తనతో విడాకులు తీసుకోకుండానే మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతున్నాడు అంటూ నందిని కోర్టుకి వెళ్లారు. 2008లో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఇప్పటి నందిని, పవన్ కళ్యాణ్ విడిపోయి 16 ఏళ్ళు అవుతోంది.
పవన్ తో విడిపోయాక నందిని ఎప్పుడూ, ఎక్కడా మీడియాకి కనిపించలేదు. ఆమె యుఎస్ లో సెటిల్ అయిన ఓ ఎన్నారై డాక్టర్ ని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన పేరుని జాహ్నవి అని మార్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ని 2009లో వివాహం చేసుకున్నారు.
Pawan Kalyan
ఆమె నుంచి కూడా పవన్ విడిపోయిన సంగతి తెలిసిందే. 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ తరచుగా అభిమానులతో టచ్ లో ఉంటారు. కానీ నందిని మాత్రం అమెరికాలో సెటిల్ అయ్యారు.