MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • వాళ్ళు తొడంటే వీళ్లు మెడంటున్నారు... పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన మహేష్ ఫ్యాన్స్!

వాళ్ళు తొడంటే వీళ్లు మెడంటున్నారు... పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన మహేష్ ఫ్యాన్స్!

టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు ఎవరంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.  ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం. ఈ ఇద్దరు హీరోల బాక్సాఫీస్ రికార్డ్స్ అందుకు నిదర్శనం. అదే సమయంలో ఈ హీరోల ఫ్యాన్స్ పరస్పరం పోటీ పడుతూ ఉంటారు. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అరుదైన రికార్డు నమోదు చేయగా... దాన్ని బీట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 11 2022, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
pawan kalyan mahesh babu

pawan kalyan mahesh babu


కరోనా కారణంగా గత రెండేళ్లు మహేష్ బర్త్ డే వేడుకలు ఫ్యాన్స్ జరుపుకులేకపోయారు. దీంతో ఈ ఏడాది భారీగా ప్లాన్ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు స్పెషల్ ఈవెంట్స్ జరపాలని పూనుకున్నారు. ముఖ్యంగా మహేష్ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ గా ఉన్న ఒక్కడు, పోకిరి చిత్రాల స్పెషల్ షోస్ వరల్డ్ వైడ్ ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


దీని కోసం నెలరోజు కసరత్తులు చేసిన మహేష్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో రెగ్యులర్ మూవీలా షోస్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలకు విశేష స్పందన దక్కింది. ముఖ్యంగా పోకిరి ఆడుతున్న థియేటర్స్ కి ఫ్యాన్స్ పోటెత్తారు. వరల్డ్ వైడ్ పోకిరి సినిమా 375 షోస్ వేసినట్లు సమాచారం. 

37

అలాగే  యావరేజ్ గా 70 నుండి 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పోకిరి ఏకంగా రూ. 1.72 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఎప్పుడో 15 ఏళ్ల క్రిందట విడుదలైన మూవీ రీరిలీజ్ కి ఒక్కరోజు అంత మొత్తంలో వసూలు చేయడం అరుదైన విషయంగా పరిగణిస్తున్నారు. 

47

మహేష్ చిత్రాల స్పెషల్ షోస్ ద్వారా వసూలైన మొత్తాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేయనున్నారు. పోకిరి సక్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మంట రేపింది. ఇక పవన్ ఫ్యాన్స్  తిక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందులోనైనా మా హీరోనే గొప్పని చెప్పుకునే వీరు.. పోకిరి రికార్డ్స్ బ్రేక్ చేయాలని పూనుకున్నారు. 
 

57


సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే నేపథ్యంలో జల్సా చిత్ర ప్రదర్శన చేయాలి అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో ప్రత్యేక ప్రదర్శనలు చేసి భారీ మొత్తంలో వసూళ్లు సాధించాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. దీని కోసం సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా గ్రూప్స్ లో విషయాన్ని షేర్ చేస్తున్నారు. 
 

67

మహేష్ ఫ్యాన్స్ పోకిరి చిత్రాన్ని ఓ రేంజ్ లో సక్సెస్ చేసి పవన్ ఫ్యాన్స్ కి మెంటల్ తెప్పించారు. ఒకరంగా చెప్పాలంటే వాళ్ళను రెచ్చగొట్టారు. దీనితో వాళ్ళు తొడ కోసుకున్నారు, మనం కోసుకోవాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. ఒక విధంగా పవన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోయున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఈ స్థాయి రికార్డు నమోదు చేస్తారో చూడాలి. 

77

అలాగే ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే కాగా.. మెగా ఫ్యాన్స్ ఇదే తరహా షోస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ఆల్ టైం హిట్ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు ప్రణాలికలు వేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య నెలకొన్న ఈ వాతావరణం ఒకింత థియేటర్స్ ఓనర్స్, సమాజానికి మంచే చేస్తుంది.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved