అనుకున్నంతా అయ్యింది.. ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి
వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమా వివాదం ముదురుతోంది. పరిస్థతి భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీస్ కంపెనీ మీద దాడి జరిగింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వర్మ ఆఫీస్ మీద రాళ్లతో దాడి చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ముఖ్యంగా వివాదాస్పద అంశాలతో సినిమాలు రూపొందిస్తున్న వర్మ ఓ వర్గానికి ఎప్పుడూ టార్గెట్ అవుతున్నాడు. తాజాగా పవర్ స్టార్ పేరుతో పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పేశాడు. తాను ఎవరినీ ఉద్దేశించి ఈ సినిమా తీయటం లేదని వర్మ పదే పదే చెపుతున్నా నమ్మే పరిస్థితి కనిపించటం లేదు.
ఇప్పటికే వర్మను టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు సినిమాలు రూపొందిస్తున్నారు. పరాన్నజీవి సినిమాను పవర్ స్టార్ రిలీజ్ రోజే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో పరిస్థతి భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీస్ కంపెనీ మీద దాడి జరిగింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వర్మ ఆఫీస్ మీద రాళ్లతో దాడి చేశారు.
వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటన పై వర్మ తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఈ దాడి తన సినిమాకు మరింత పబ్లిసిటీ తీసుకువచ్చిందని, తన పవర్ స్టార్ సినిమా ట్రైలర్‌కు వ్యూస్ మరింతగా పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేశాడు వర్మ. అంతేకాదు తన అభిమానులు 50 మంది రక్షణగా వచ్చేందుకు రెడీ అవుతున్నారని వర్మ చెప్పాడు.
అయితే ఈ విషయంలొ పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా అన్న విషయం తనకు తెలియదని చెప్పాడు వర్మ. గతంలో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తన అందరి పేర్లు చెప్పిన తీసినా ఏం చేయలేదని, పవర్ స్టార్ ఫిక్షనల్ సినిమా ఈ సినిమా విషయంలో నన్ను ఏమని ప్రశ్నిస్తారంటున్నాడు వర్మ. పవన్ కూడా కేసీఆర్‌ను తాటా తీస్తా అన్నాడు.. గుడ్డలూడదీసి కొడతా అన్నాడు అది క్రిటిసైజ్ చేయటం కాదా..? అంటూ ఎదురు ప్రశ్నించాడు వర్మ.