'బ్రో' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిట్టయినట్లేనా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన 'బ్రో'. ఈ చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన 'బ్రో'. ఈ చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ మాస్ చిత్రాల రేంజ్ లో బజ్ లేకపోయినప్పటికీ.. ఈ విభిన్న చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిత్ర యూనిట్ టాలీవుడ్ సెలెబ్రిటీల కోసం బ్రో మూవీ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
ఈ స్పెషల్ ప్రీమియర్ ద్వారా బ్రో మూవీ విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ మార్కండేయ అలియాజ్ మార్క్ పాత్రలో నటిస్తున్నారు. తండ్రి మరణంలో ఫ్యామిలీ బాధ్యతలతో పాటు కంపెనీ బాధ్యతలు కూడా సాయిధరమ్ తేజ్ మోయాల్సి వస్తుంది. కంపెనీని డెవెలప్ చేసే క్రమంలో తన టైం మొత్తాన్ని వర్క్ కేటాయిస్తూ టైం లేదు టైం లేదు అని తిరుగుతుంటాడు.
ఫ్యామిలీతో గడిపే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలో మార్క్ యాక్సిడెంట్ కి గురై మరణిస్తాడు. అప్పుడే మార్క్ ఎదుట కాల దేవుడిగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అవుతాడు. ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపు చోటు చేసుకుంది.. తేజు, కాల దేవుడి మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తికరం. బ్రో మూవీ ఓవరాల్ గా మంచి అనుభూతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా ఉంటాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా ఆకట్టుకుంటుదట. ఒరిజినల్ వర్షన్ తో పోల్చితే త్రివిక్రమ్ ఈ కథలో చాలా మార్పులే చేశారట. అయినప్పటికీ ఇది విభిన్నమైన చిత్రం. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని వెళితే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే చిత్రం కాదని అంటున్నారు.
కానీ పవన్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక కథగా దీనిని చూస్తే మ్యాజిక్ ఫీల్ అవ్వచ్చు. తేజు, పవన్ ఇద్దరూ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. సముద్రఖని త్రివిక్రమ్ సహాయంతో ఈ కథని బాగా కనెక్ట్ అయ్యేటట్లు మలిచారు అని సమాచారం. ఓవరాల్ గా ఈ మూవీ పవన్, తేజు కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రంగా మిగిలిపోతుందట. అయితే బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటనేది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంది.