- Home
- Entertainment
- బాక్సాఫీస్ వద్ద బీభత్సం 'బ్రో'.. పవర్ స్టార్ పిండేశాడుగా, ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
బాక్సాఫీస్ వద్ద బీభత్సం 'బ్రో'.. పవర్ స్టార్ పిండేశాడుగా, ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి ఉన్న లిమిటేషన్స్ దృష్ట్యా రిలీజ్ కి ముందు అంతగా బజ్ లేదు. దీనికి తోడు తొలిరోజు క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సత్తా బలంగా పనిచేస్తోంది. బ్రో మూవీ తొలి రోజు పవన్ కళ్యాణ్ గత కమర్షియల్ చిత్రాలకు ధీటుగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యంలో ముంచెత్తింది. వరల్డ్ వైడ్ గా బ్రో చిత్రం తొలి రోజు ఏకంగా 48 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ షేర్ దాదాపు రూ 30 కోట్లుగా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం తట్టుకుని కూడా బ్రో చిత్రం ఫస్ట్ డే 23.5 కోట్ల షేర్ పిండేసుకుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26 కోట్ల షేర్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ స్థాయిలో బ్రోపై అంచనాలు లేనప్పటికీ ఈ రేంజ్ వసూళ్లు నమోదయ్యాయి అంటే అది పవన్ కళ్యాణ్ మ్యాజిక్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఏరియాల వారీగా గమనిస్తే.. నైజాంలో 8.5 కోట్లు, సీడెడ్ లో 2.7 కోట్లు, ఉత్తరాంధ్ర 2.6, ఈస్ట్ గోదావరి 2.5, వెస్ట్ లో 2.9 కోట్లు, గుంటూరులో 2.5, కృష్ణలో 1.2, నెల్లూరు లో 71 లక్షలు సాధించింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 2.2 కోట్లు నమోదయ్యాయి. బ్రో చిత్రానికి వరల్డ్ వైడ్ గా 98 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తొలిరోజే ఈ చిత్రం దాదాపు 30 శాతం రికవరీ సాధించడం విశేషం.
బ్రో చిత్రంపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్స్ బాగా పేలాయని అంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగులు, పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ , మ్యానరిజమ్స్ , సాయిధరమ్ తేజ్ నటన బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. మరి వీకెండ్ మొత్తం ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
ఈ చిత్రం లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, రోహిణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తికి కాల దేవుడు ప్రత్యక్షమై సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కథగా ఎంచుకుని సముద్రఖని ఈ చిత్రాన్ని రూపొందించారు. వరిజినల్ వర్షన్ తో పోల్చితే త్రివిక్రమ్ ఇందులో చాలా మార్పులు చేశారు.