- Home
- Entertainment
- ఓజీ కలెక్షన్స్ ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఇదే.. ఈసారి విధ్వంసం ఇంకెలా ఉంటుందో..
ఓజీ కలెక్షన్స్ ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఇదే.. ఈసారి విధ్వంసం ఇంకెలా ఉంటుందో..
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. భారీ వసూళ్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది.

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఓజీ నిలిచింది. ఇప్పటికే ఓజీ చిత్రం వరల్డ్ వైడ్ గా 250 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది. వీక్ డేస్ లో కూడా ఓజీ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందింది. ఈ కథకి సుజీత్ జపాన్ బ్యాక్ డ్రాప్ ఇచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో నెవర్ బిఫోర్ అనిపించే విధంగా యాక్షన్ అవతారంలో మెప్పించారు.
డిప్యూటీ సీఎంగా బిజీ
ఓజీ మూవీ ఐదు రోజుల్లోనే దాదాపు 90 శాతం రికవరీ సాధించి బ్రేక్ ఈవెన్ కి చేరువవుతోంది. వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రం 150 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఆల్రెడీ ఓజీ మూవీ ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఓజీ మూవీ ఈ రేంజ్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో కూడా పవన్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఏపీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పవన్ సినిమాలకు సమయం కేటాయించడం కష్టంగా మారుతోంది. హరిహర వీరమల్లు, ఓజీ లాంటి చిత్రాలు ఏళ్ల తరబడి సెట్స్ పై ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు.
ఓజీ యూనివర్స్ ప్రకటన
కానీ ఓజీ మూవీ ఇచ్చిన జోష్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే నిర్ణయం తీసుకున్నారు. ఓజీ చిత్రానికి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని.. ఓజీని యూనివర్స్ లాగా కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఓజీ 2 మాత్రమే కాదు.. ఆ తర్వాత కూడా ఓజీ యూనివర్స్ ఉంటుంది అని పవన్ చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఓజీపై నమ్మకంతో ఉన్నారో అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ స్పెషల్ షో వీక్షించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్ కొనసాగుతుంది అని అనౌన్స్ చేశారు.
నిరాశ పరిచిన హరిహర వీరమల్లు
పవన్ కళ్యాణ్ చివరగా నటించిన బ్రో, హరిహర వీరమల్లు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. ఓజీ మాత్రం పవన్ కళ్యాణ్ స్టామినాకి తగ్గట్లుగా వసూళ్లు రాబడుతోంది. ఓజీ చిత్రాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ కలెక్షన్స్, సక్సెస్ ఇవ్వన్నీ పక్కన పెడితే ఓజీ చిత్రం గ్రేట్ వాచ్ ఎక్స్పీరియన్స్ అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరే ఇతర చిత్రానికి కమిట్ కాలేదు. సో పవన్ చేసిన తాజా ప్రకటనతో ఆయన నెక్స్ట్ మూవీ ఓజీ 2 అనేది స్పష్టం అయింది.
ఓజీ జస్ట్ శాంపిల్ మాత్రమే
ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుజీత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి ఓజీ జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఓజీ2 ఇంకా భారీగా ఉండబోతోంది అని అన్నారు.