బాబోయ్, జాన్వీ కపూర్ ఏంటి బుచ్చిబాబుకి ఇలా ఫిదా అయిపోయింది.. మామూలోడు కాదు
బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ డైరెక్టర్ బుచ్చిబాబు గురించి చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

రాంచరణ్ పెద్ది మూవీ
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది. దేవర మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ఛాన్స్ దక్కించుకుంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ ఎమోషన్స్, స్పోర్ట్స్ కలగలిపిన యాక్షన్ మూవీగా పెద్ద చిత్రాన్ని బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రం కోసం తన మేకోవర్ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ గ్లింప్స్ వైరల్ అయింది.
ఫస్ట్ టైం జాన్వీ కపూర్, రాంచరణ్ కాంబినేషన్
తొలిసారి రాంచరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ కావడంతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా ఫ్యాన్స్ లో ఉంది. జాన్వీ, చరణ్ జోడీపై ఆడియన్స్ అంతలా ఆసక్తి చూపడానికి కారణం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిలది వెండితెరపై సూపర్ హిట్ జోడి. దీనితో వారి వారసులు కలసి ఎలా నటిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు రాముడు మంచి బాలుడు అన్నట్లుగా కనిపిస్తారు. కానీ పెద్ది చిత్రంతో బుచ్చిబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు అని ఇన్సైడ్ టాక్. బుచ్చిబాబు పెద్ది చిత్రంతో పెద్దగానే ఏదో చేయబోతున్నాడు అని అంటున్నారు.
బుచ్చిబాబుకి జాన్వీ కపూర్ ఫిదా
తన వర్క్ తో బుచ్చిబాబు ఏకంగా జాన్వీ కపూర్ నే ఫిదా చేసేశాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ బుచ్చిబాబు గురించి ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సన్నీ సంస్కారి కి తులసి కుమారి అనే చిత్రంలో నటిస్తోంది. అక్టోబర్ 2న ఈ మూవీ రిలీజ్ కానుండడంతో జాన్వీ కపూర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఓ ఇంటర్వ్యూలో పెద్ది మూవీ గురించి జాన్వీ ఓపెన్ అయింది. రాంచరణ్ సార్ తో పెద్ది చిత్రం చేస్తున్నాను. అది బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రం. ఈ మూవీలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా వైవిధ్యంగా ఉంటుంది.
సెట్స్ లోకి స్టూడెంట్ లాగా వస్తారు
బుచ్చిబాబు సార్ అద్భుతమైన దర్శకుడు. మీరు ఉప్పెన చిత్రం చూశారో లేదో తెలియదు. సూపర్బ్ మూవీ అది. ఆయన చాలా రూటెడ్ డైరెక్టర్. ఆయన విజన్, పెట్టే ఎఫర్ట్స్ మామూలుగా ఉండవు. ఈ మూవీలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో ఉండే హీరోయిన్ పాత్ర కాదు నాది. రాంచరణ్ సార్ అయితే అమేజింగ్ పర్సన్. ఆయన చాలా సిన్సియర్. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ లోకి ఒక స్టూడెంట్ లాగా వస్తారు అని జాన్వీ కపూర్ తెలిపింది. ఇక పెద్ది మూవీపై రాంచరణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. గేమ్ ఛేంజర్ చిత్రం నిరాశ పరచడంతో పెద్ది మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
అంచనాలు పెంచేలా జాన్వీ కపూర్ కామెంట్స్
పెద్ది చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ పెద్ది మూవీ గురించి చెప్పిన జెన్యూన్ ఒపీనియన్ అంచనాలు పెంచేలా ఉంది.