MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాడ్స్ చేయకపోవటపోవటానికి కారణం నాలోని ఆ లక్షణమే: పవన్ కళ్యాణ్

యాడ్స్ చేయకపోవటపోవటానికి కారణం నాలోని ఆ లక్షణమే: పవన్ కళ్యాణ్

 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. అందుకు కారణం ఆయన మొదటి నుంచి ఓ నిబద్దతతో ఉండటమే. 

4 Min read
Surya Prakash
Published : Jun 24 2024, 06:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Pawan Kalyan DCM

Pawan Kalyan DCM


జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ అనుకున్నది సాధించాడు. జగన్ నిన్ను గెలవనివ్వను.. పాతాళంలోకి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్ దానిని నిలబెట్టుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరిపుచ్చి ఓటు వేయలేదనే దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు.   మూడు పార్టీలు.. మూడు గుర్తులు... కొంత గందరగోళం అని అనుకున్నా .. సక్సెస్ ఫుల్ గా గుర్తులను బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఎంతగా అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు.  తదనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. అందుకు కారణం ఆయన మొదటి నుంచి ఓ నిబద్దతతో ఉండటమే. అందుకు పెద్ద ఉదాహరణ ఆయన ఏ ప్రొడక్ట్ కు యాడ్స్ చేయకపోవటమే.

214
Pawan Kalyan

Pawan Kalyan


చాలా మంది తెలుగు  హీరోలకు సినిమాలు షూటింగ్  చేయడానికే టైమ్ సరిపోవడం లేదని అనుకుంటాం.  కానీ వాళ్ల ప్లానింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.  తమ టైమ్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటు సినిమాలు, అటు యాడ్స్ కుమ్మేస్తున్నారు.తమ డేట్స్  విషయంలో ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లమ్ కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ స్టార్ కూడా తమ దగ్గరకు అందివచ్చిన ఏ యాడ్ ని వదిలే ప్రసక్తేలేదంటున్నారు.
 

314
Pawan Kalyan

Pawan Kalyan


ముఖ్యంగా  మహేష్ బాబు, అల్లు అర్జున్  తెలుగులో యాడ్స్ లో నెంబర్ వన్ అనే చెప్పాలి.  సినిమాల వరకే కాదు ఈ హీరోలిద్దరూ ఇప్పుడు యాడ్స్ లోనూ యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తున్నారు.  మహేష్ బాబు మౌంటేన్ డ్యూ యాడ్ లో న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తూనే యాక్షన్ లో ఇరగదీశాడు మహేష్. ‘మొనగాడురా.. భయపడడురా..!’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ యాడ్.. విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

414


మరోవైపు అల్లు అర్జున్ కూడా కొత్త యాడ్ తో సందడి చేస్తున్నాడు. తగ్గేదే లే అన్న రీతిలో ‘పైపు లీక్ అయ్యేదే లే!’ అంటూ ఆస్ట్రాల్ పైప్ యాడ్ తో అదరగొడుతున్నాడు. సరికొత్త యాక్షన్ ట్రీట్ అందిస్తున్న మహేష్, అల్లు అర్జున్ యాడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. బన్నీ పుష్ప సినిమా తర్వాత జొమాటో, ర్యాపిడో, శ్రీ చైతన్య కాలేజీ ల వాణిజ్య ప్రకటనలో కనిపిస్తున్నాడు.ఇటీవలే త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఒక యాడ్ షూటింగ్ చేశాడు.
 

514


సినిమాలకైతే దాదాపు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కష్టపడాలి.ఇటీవలి కాలంలో అయితే మరింత ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది.కానీ వాణిజ్య ప్రకటనలో 1,2 రోజులు కష్టపడితే చాలు కోట్లు వెనకేసుకునేందుకు అవకాశం ఉంటుంది.దీంతో హీరోలందరూ కూడా ఈ వాణిజ్య ప్రకటనలో బాగా పోటీపడుతున్నారు . కానీ వీటికి దూరం.
 

614


సినిమాలతో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఆయన యాడ్స్ చేస్తానంటే అసలు ఖాళీనే ఉండదు. తన తోటి స్టార్స్ అంతా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం యాడ్స్ చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఓ 20 ఏళ్ళ క్రితం కోలా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్ మొదటి, చివరి యాడ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాడ్స్ చేయలేదు.

714


 పవన్ కళ్యాణ్ ని అనేక  ఇంటర్వ్యూలలో దీనిపై అడిగితే.. ఆ కోలా వల్ల హెల్త్ సమస్యలు వస్తాయి. ప్రజలకు మంచిది కానప్పుడు నేను చేయకూడదు డబ్బుల కోసం అని తెలిపారు.  పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తూ.. నేను గతంలో ఓ కోలా యాడ్ చేసాను. కోలాల వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆ యాడ్ వదిలేసాను. ఆ తర్వాత షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఇస్తాను అన్నారు. ఆ యాడ్ కంటిన్యూ చేయమని అడిగారు. కానీ నేను నో చెప్పాను. నేను నా నమ్మకాలు వదిలేసి డబ్బుల కోసం యాడ్స్ చేసి ఉంటే బోల్డంత డబ్బు సంపాదించేవాడిని అని అన్నారు. 

814


తాను ఒకేసారి అడ్వర్టయిజ్‌మెంట్ చేశానన్న పవన్.. తాను కోలా డ్రింకులు తాగనన్నారు. పొలం కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతోనే ఆ యాడ్ చేశానన్నారు. ఆ ప్రకటనలో నటించినందుకు గానూ.. జాతీయ స్థాయిలో చేస్తున్న హీరోల కంటే తనకు రూ.40 లక్షలు ఎక్కువే ఇచ్చారని తెలిపారు. ఆ డ్రింక్ మంచిదా? కాదా? అనేది అనవసరమన్న జనసేనాని.. ఆ పనికి న్యాయం చేయలేననే ఉద్దేశంతోనే యాడ్స్‌లో కనిపించడం మానేశానని తెలిపారు.

914
Pawan kalyan and chandrababu Naidu

Pawan kalyan and chandrababu Naidu


అలాగే నేను యాక్టర్ గా ఉండి ఎన్ని యాడ్స్ చేసి ఉండవచ్చు. కొన్ని కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఎందుకు చెయ్యలేదు. అరే పపన్ కళ్యాణ్ అనేవాడు గొంతు విప్పితే అది ప్రజలకి మేలు జరగాలి. ప్రజల కష్టాలకు భుజం కాయాలి. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి నేను ఈ మాటలు అనటం లేదు. ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది. సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. 

1014


దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి పవన్ చేస్తానంటే చాలా కంపెనీలు తమకు యాడ్స్ చేయించుకోడానికి రెడీగా ఉన్నాయి. కానీ పవన్ యాడ్స్ కి ఎప్పుడో నో చెప్పారు.  

1114


అలాగే ప్రకటనల్లో నటించే వాళ్లను తప్పుబట్టడం తన ఉద్దేశం కాదని జనసేనాని స్పష్టం చేశారు. ఒక్క యాడ్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదించగలనో మీరు ఊహించగలరన్న పవన్.. ప్రజాసమస్యలకు నా గొంతు బ్రాండ్ అంబాసిడర్ కావాలి.. కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకోలేదన్నారు. ఇక్కడ ఎవర్నీ తగ్గించాల్సిన అవసరం లేదన్న పవన్.. తాను నమ్మిన మార్గం ఇదన్నారు.
 

1214


ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను.. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలవబోతున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్నారు నిర్మాతలు.
 

1314


ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించనున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ను కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.
 

1414

పవర్ స్టార పవర్ కళ్యాణ్.. టాలీవుడ్ లో స్టార్ హీరో. రోజుకు రెండు కోట్లు సంపాధించే స్టార్. రాజకీయల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశాడు. ఎన్నో మాటలు..అవమానాలు తరువాత  పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. వంద శాంతం తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు పవన్. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved