- Home
- Entertainment
- మనసు చంపుకొని నటించలేను.. అందుకే దూరమయ్యా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మనసు చంపుకొని నటించలేను.. అందుకే దూరమయ్యా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో `తమ్ముడు` చిత్రంతో పాపులర్ అయిన హీరోయిన్ ప్రీతి జింగానియా.. తాను సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణాలు బయటపెట్టింది. మనసుని చంపుకుని ఉండలేనంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

పవన్ కళ్యాణ్ నటించిన `తమ్ముడు` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రీతి జింగానియా. క్యూట్ అందాలతో మెరిసింది. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా హిట్ కావడంతో ఈ బ్యూటీకి మంచి పేరే వచ్చింది. ఆ వెంటనే బాలకృష్ణ `నరసింహానాయుడు`, నాగార్జున గెస్ట్ రోల్ చేసిన మోహన్‌బాబు `అధిపతి` చిత్రంలో మెరిసింది. కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం వెంటవెంటనే రాలేదు.
photo credit-preeti insta
`అప్పారావు డ్రైవర్ స్కూల్`, `ఆనందమానందమాయే`, `విశాఖ ఎక్స్ ప్రెస్`, `యమదొంగ`, `తేజమ్` చిత్రాల్లో ఐటెమ్ సాంగులు చేసింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో త్వరగానే ఫేడౌట్ అయ్యింది. కానీ బాలీవుడ్‌లో మంచి జోరు చూపించింది. అక్కడ పెద్ద సినిమాలు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో క్యూట్ అందాలతో మెరిసిన ఈ భామ.. బాలీవుడ్‌లో మాత్రం గ్లామర్ షోతో పిచ్చెక్కిచ్చింది. నార్త్ ఆడియెన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. దాదాపు 13ఏళ్ల గ్యాప్‌లో నలభై సినిమాలు చేసిన ఈ భామ ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యింది.
photo credit-preeti insta
హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె గుడ్ బై చెప్పింది. అందరిని ఆశ్చర్యపరిచింది. అందుకు కారణాలను తాజాగా వెల్లడించిందీ అందాల సోయగం. గతంలో బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ భామ తాను సినిమాలు మానేయడానికి కారణం ఏంటనేది తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి జింగానియా మాట్లాడుతూ, కోరుకున్న పాత్రలు దక్కలేదని, దీంతో మనసు చంపుకుని సినిమాలు చేయలేకపోయానని తెలిపింది.
photo credit-preeti insta
`నేను కోరుకున్న పాత్రలు నాకు రాలేదు. వచ్చిన పాత్రలతో సంతోషంగా లేను. సినిమాల్లో కీలకమైన పాత్రలు చేయాలని ఉండేది, అలాగని సినిమాల్లో నేనే హైలైట్ కావాలని అనుకోవడం లేదు. కానీ కనీస ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయాలని కోరుకున్నా. అలాంటి పాత్రలు రానప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యాను. నేను అసంతృప్తికి గురి కావడమే కాదు, అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఓ అడుగు వెనక్కి వేశా` అని తెలిపింది ప్రీతి జింగానియా.
photo credit-preeti insta
అయితే తాను సినిమాలు చేయలేదు కానీ సినీ రంగానికి దూరం కాలేదని చెప్పింది ప్రీతి. `విక్టోరియా నెం.203` తర్వాత హిందీలో సినిమాలు చేయలేదు,కానీ పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించినట్టు చెప్పింది. ఈవెంట్లు, షోస్, స్పెషల్ అప్పీయరెన్స్ లతో మెరుస్తూనే ఉన్నానని, దీంతో సినిమాలకు దూరమైన ఫీలింగ్ లేదని తెలిపింది ప్రీతి. కాకపోతే బాలీవుడ్‌లో నటించడాన్ని మిస్ అవుతున్నట్టు తెలిపింది. ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చానని, మళ్లీ కెమెరా ముందు నటించడం చాలా హ్యాపీగా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రీతి `కఫాస్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తానని తెలిపింది. ఇక ప్రీతి జింగానియా.. నటుడు, దర్శకుడు పర్వీన్ డబాస్‌ని 2008లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు జైవీర్, దేవ్ ఉన్నారు. ప్రస్తుతం ప్రీతి ముంబయిలో ఉంటుంది.
photo credit-preeti insta
ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సమయంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రీతి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను బాలీవుడ్ నుంచి తరిమేయాలని ఓ గ్రూపు ప్రయత్నించిందంటూ సంచలన కామెంట్ చేసింది. తాను కొన్ని మల్టీస్టారర్ సినిమాలు చేశానని, ఆ టైమ్ లో గ్రూపిజం ఎదుర్కొన్నట్టు వెల్లడించింది. కొన్ని గ్యాంగ్స్ తనని బాలీవుడ్ నుంచి బయటకు తరిమేయాలని ప్రయత్నించాయని, సెన్సిటివ్ గా ఉంటే ప్రతి ఒక్కరు మనల్ని ఆడుకుంటారని, తాను మాత్రం వాటిని ఎక్కువగా పట్టించుకోలేదని, కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా నటించేదాన్ని అని, తన పని తాను చూసుకుని వెళ్ళానని వెల్లడించింది ఈ అందాల భామ.