- Home
- Entertainment
- నన్ను, నరేష్ ని సపోర్ట్ చేయండి అని వేడుకున్న పవిత్ర లోకేష్..ఇది ఫ్యామిలీ మ్యాటర్, రమ్యపై షాకింగ్ కామెంట్స్
నన్ను, నరేష్ ని సపోర్ట్ చేయండి అని వేడుకున్న పవిత్ర లోకేష్..ఇది ఫ్యామిలీ మ్యాటర్, రమ్యపై షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ లో ఉందని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.

నటి పవిత్ర లోకేష్.. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీనియర్ నటిగా పవిత్ర లోకేష్ దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందారు. తల్లి పాత్రలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ లో ఉందని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
మరికొన్ని రూమర్స్ ప్రకారం వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అని ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. నరేష్ కి తన మూడో భార్య రమ్యతో విభేదాలు కొనసాగుతున్నాయి. దీనితో అతడు పవిత్రని వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు అనేక కథనాలు వెలువడుతున్నాయి.
వీరిద్దరూ కలసి గుడులు గోపురాలు తిరుగుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ ఎక్కువవుతున్న తరుణంలో నరేష్ మూడో భార్య సీన్ లోకి ఎంటర్ అయింది. రమ్య బెంగుళూరు వెళ్లి అక్కడ మీడియాలో నరేశ్ తన భర్త అని.. పవిత్ర లోకేష్ తమ బంధానికి అడ్డుగా మారింది అంటూ విమర్శలు కురిపించింది. ఈ విమర్శలపై నరేష్ కూడా స్పందించారు. పవిత్రతో టీనా బంధం గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. రమ్య ఆరోపణలని ఖండించారు.
తాజాగా పవిత్ర కూడా వీడియోలో స్పందించింది. అసలు నరేష్ తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానా లేదా అనే విషయంలో పవిత్ర కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోలో రమ్య తమని అనవసరంగా బ్యాడ్ చేస్తోంది అని మాత్రమే పవిత్ర లోకేష్ తెలిపింది.
నరేశ్ గారు ఎవరు, ఆయన ఫ్యామిలీ ఏంటి అనేది అందరికి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తమ రిలేషన్ పై దాటవేసింది. కానీ రమ్య ఇక్కడ బెంగుళూరుకి వచ్చి మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. నేను వాళ్ళిద్దరి బంధానికి అడ్డుగా ఉన్నానని.. నేను నరేష్ ,పెళ్లి చేసుకున్నాం అని మీడియాకు చెప్పింది. ఆమె చేసిన ఆరోపణలు నా మనసుకి బాధ కలిగించాయి.
నన్ను టార్గెట్ చేస్తూ దోషిగా నిలబెట్టింది. దీనిపై నరేష్ కూడా మాట్లాడారు. నేను కూడానా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రమ్య గారు ఆమెకి భర్త కావాలని ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే మాట్లాడాలి. ఇది ఫ్యామిలీ మ్యాటర్. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. ఇక్కడ కర్ణాటకు వచ్చి ఆమె ఎందుకు మాట్లాడుతోంది. ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముందు తేల్చుకోవాలి అని పవిత్ర సూచించారు.
బెంగళూరు కి వచ్చిన నన్ను చాలా బ్యాడ్ చేసేశారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఈ విషయంలో నన్ను, నరేష్ ని సపోర్ట్ చేయండి అని పవిత్ర వేడుకోవడం కొసమెరుపు. తనకి నరేష్ తో రిలేషన్ షిప్ లేదని కానీ.. నరేష్ ని తాను పెళ్లి చేసుకోవడం లేదు అని కానీ పవిత్ర చెప్పలేదు. దీనితో వీరిద్దరిపై రూమర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.