MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 10 మందికి ఉండే ఎనర్జీ నరేష్ ఒక్కరిలో ఉంది, రాత్రయితే అలసిపోతా.. పవిత్ర లోకేష్ వ్యాఖ్యలని నెటిజన్లు మరోలా

10 మందికి ఉండే ఎనర్జీ నరేష్ ఒక్కరిలో ఉంది, రాత్రయితే అలసిపోతా.. పవిత్ర లోకేష్ వ్యాఖ్యలని నెటిజన్లు మరోలా

పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసలు కురిపించారు. నరేష్ ఎనేర్జి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్ కి దిగుతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 20 2025, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సీనియర్ నటుడు నరేష్ జనవరి 20న తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నరేష్ మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలు పంచుకున్నారు. నరేష్ తో పాటు అతడి భార్య పవిత్ర లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో నరేష్ తన సినీ కెరీర్ ని గుర్తు చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

52 ఏళ్లుగా తన కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది అని తెలిపారు. అదే విధంగా తన తల్లి విజయ నిర్మలని గుర్తు చేసుకున్నారు. ఆమెకి పద్మ అవార్డు వచ్చేలా పోరాటం చేస్తానని తెలిపారు. తన డ్రీమ్ రోల్ గురించి కూడా రివీల్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. కానీ నపుంసకుడిగా నటించాలనేది నా డ్రీమ్. ఎందుకంటే అలాంటి పాత్రలో ఛాలెంజ్ ఉంటుంది అని తెలిపారు. 

35

ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసలు కురిపించారు. నరేష్ కి బర్త్ డే గిఫ్ట్ గా షర్ట్ ఇచ్చానని, ఆయన వేసుకున్న షర్ట్ అదే అని మీడియా సమావేశంలో తెలిపారు. తాను కట్టుకున్న చీర ఆయన సెలెక్ట్ చేసిందే అని సరదాగా తెలిపారు. నరేష్ గారికి జీవితంలో ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరు జంధ్యాల గారు కాగా మరొకరు వాళ్ళ అమ్మ విజయ నిర్మల అని తెలిపింది. వీళ్ళిద్దరిని నరేష్ ప్రతి రోజూ తలుచుకుంటూనే ఉంటారు. నరేష్ గారికి ఉన్న స్టేటస్ కి ప్రతి రోజు వాళ్ళని తలచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి పెద్దల పట్ల గౌరవం ఉంది అని పవిత్ర పేర్కొంది. 

45

పవిత్ర లోకేష్ నరేష్ ఎనర్జీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్ కి దిగుతున్నారు. పవిత్ర మాట్లాడుతూ.. 10 మందికి ఉండే శక్తి నరేష్ ఒక్కరిలో ఉంది. మనం ఆయనతో పోటీ పడలేం. నేను రాత్రి అయితే త్వరగా అలసిపోతాను. ఆయన స్టాఫ్ కూడా అలసిపోతారు. మిగిలిన వర్క్ నువ్వే చూసుకో అని చెప్పేస్తానని, ఆయన మాత్రం అలసి పోరు అని పవిత్ర పేర్కొంది. వర్క్ విషయంలో నరేష్ అంత ఎనర్జిటిక్ గా, డెడికేటెడ్ గా ఉంటారనేది పవిత్ర ఉద్దేశం. 

55

కానీ పవిత్ర వ్యాఖ్యలని నెటిజన్లు మరోలా తీసుకుంటూ సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ కామెంట్స్ పెడుతున్నారు. నరేష్, పవిత్ర మీడియా ముందు ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది. కొన్ని కామెంట్స్ ట్రోలింగ్ మెటీరియల్ గా మారుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved