Pushpa 2 The Rule : పుష్ప 2 కథ సిల్లీగా ఉంది, రామాయణంతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు
Allu Arjun and Sukumar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 1800 కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించాడు.

Allu Arjun, Sukumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 1800 కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ చిత్రంలో పలు అంశాలు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. జపాన్ పోర్ట్ లో ఇంట్రడక్షన్ ఫైట్, అల్లు అర్జున్ లేడీ గెటప్,క్లైమాక్స్ లో అన్న కూతురు కోసం చేసే విధ్వంసం ఆడియన్స్ బాగా ఎంగేజ్ చేశాయి.
pushpa 2
అయితే ఈ చిత్ర కథ సిల్లీగా ఉందంటూ సీనియర్ రచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తరచుగా టాలీవుడ్ చిత్రాలకి తనదైన శైలిలో విశ్లేషణ అందిస్తుంటారు. పుష్ప 2 గురించి మాట్లాడుతూ సిల్లీ కారణంతో పుష్ప 2 కథ మొదలైంది అని తెలిపారు. పుష్ప 2 కథని రామాయణంతో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో శూర్పణఖకి అవమానం జరగకపోతే ఆ కథ ఉండేది కాదు.
Allu Arjun
పుష్ప 2లో తన భార్య కోరిక మేరకు సీఎంతో ఫోటోని పుష్పరాజ్ ఆశిస్తాడు. కానీ అవమానం జరుగుతుంది. ఆ సిల్లీ రీజన్ లేకపోతే పుష్ప 2 కథ ఉండేది కాదు అని అన్నారు. చాలా గొప్ప కథలు సిల్లీ రీజన్ తోనే మొదలవుతాయి అని పరుచూరి అన్నారు. ఒకవైపు సుకుమార్, మరోవైపు అల్లు అర్జున్ కాడె మోసినట్లు ఈ కథని మోశారు అని పరుచూరి అభినందించారు.
సుకుమార్ తెలివిగా పుష్పరాజ్ కి, సీఎం కి మధ్య కథ నడపలేదు. సీఎం కనుక పుష్ప వల్ల అవమానానికి గురై ఉంటే వాళ్ళిద్దరి మధ్య కథ జరిగేది అని పరుచూరి అన్నారు. షెకావత్ కి అల్లు అర్జున్ సారీ చెప్పిన తర్వాత సైలెంట్ గా వెళ్లడని, కౌంటర్ ఇస్తాడని ముందే ఊహించినట్లు పరుచూరి తెలిపారు.
Paruchuri Gopalakrishna
ఇది కేవలం ఒక స్మగ్లర్ కథ మాత్రమే కాదని, అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ అని సుకుమార్ క్లైమాక్స్ ద్వారా తెలిపారు. అన్న కూతురి కోసం ప్రాణాలకి తెగించి పోరాడడం, చివర్లో తన ఇంటిపేరు తాను సాధించుకోవడం ఫ్యామిలీ అంశాలే అని పరుచూరి తెలిపారు.