ఒంటరిగా హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న పరిణితి చోప్రా.. ఆటపట్టిస్తున్న నెటిజన్లు..
కొత్త పెళ్లి కూతురు బాలీవుడ్ నటి పరిణితి చోప్రా.. భర్త దగ్గర లేకుండానే.. ఒంటరిగా హనీమూన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఓ ఫోటోను శేర్ చేసిన బ్యూటీ.. ఫన్నీ కామెంట్ కూడా రాసింది.
ఈమధ్యే ఆప్ ఎంపీ.. తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ్ చద్దాను పెళ్లాడింది బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. పంజాబ్ కు చెందిన యంగ్ లీడర్ రాఘవ్ ను రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా పెళ్ళాడింది బ్యూటీ. పరిణితి చోప్రా సినిమాల కన్నా, ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.
పెద్దగా సినిమాలు చేయకపోయినా.. పరిణితీ చోప్రా బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్నఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రాఘవ్ చద్దాతో చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి.. ఇద్దరు కలిసి తెగ తిరిగేశారు. కాని ఆ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈక్రమంలో ఓ సారి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ.. ఇద్దరు కెమెరాల కళ్లకు దొరికిపోయారు.
ఇక అప్పటి నుంచి వైరల్ న్యూస్ అవుతూనరే ఉన్నారిద్దరు. ఇక తాజాగా పెళ్ళి చేసుకున్న ఈ స్టార్ సెలబ్రిటీలు.. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాఘవతో పెళ్లి తర్వాత పరిణితి హనీమూన్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కాని హనీమూన్ ను భర్తతో కాకుండా ఒంటరి గా గడిపేస్తోంది బ్యూటీ.
తాజాగా పరణితీ చోప్రా ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ఆమె హనీమూన్ లో భర్త లేకపోవడం మరో షాకింగ్ న్యూస్. వెకేషన్‌కి వెళ్లి ఆమె పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది. ఈ వెకేషన్‌కు తన మరదలుతో వెళ్లినట్టు పరిణితి చెప్పుకొచ్చింది. నేను హనీమూన్ కు వెళ్ళలేదు.. ఈ ఫోటోను నా మరదలు తీసింది.. ఇది గర్ల్స్ ట్రిప్ అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది.
ఈఫోటోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లైన జంట హాయిగా హానీమూన్ కు వెళ్లి భర్తతో ఎంజాయ్ చేయాలి కాని..ఇలా గర్ల్స్ ట్రిప్పులేంటి అటూ.. సరదాగా ఆటపట్టిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన వారు జంటగా వెళితే ఆ మధుర క్షణాలు భలే ఉంటాయి.. పెళ్లయి నెల కాలేదు భర్తతో కాకుండా మరొకరితో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావంటూ నేటిజన్లు ఆమెను సరదాగా ఆట పట్టిస్తున్నారు.
పెళ్లి తరువాత అత్తారింట్లో అడుగు పెట్టిన పరిణీతి కి గ్రాండ్ వెల్కం లభించింది. కొత్త కోడలు మొదటిసారి రాబోతుండటంతో చద్దా కుటుంబం ఆమెకు సర్ ప్రైజింగ్ వెల్కం చెప్పారు. అది చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఇంటిని ఎంతో అందంగా అలంకరించి.. ప్రత్యేకంగా స్వాగతం పలికింది చద్దా ఫ్యామిలీ. దీంతో పరిణీతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అనంతరం సాంప్రదాయబద్దంగా అత్తింట్లో అడుగుపెట్టింది.