గ్రాండ్‌గా పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వెడ్డింగ్.. ఇద్దరు సీఎంలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు..
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో అత్యంత రాయల్ వెడ్డింగ్‌లో వీరి పెళ్లి జరిగింది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె కొంత కాలంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉంది. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు. వీరి వివాహం తాజాగా ఆదివారం జరిగింది.
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో వీరి మ్యారేజ్ అత్యంత లావిష్‌గా, గ్రాండియర్ వేలో, రాయల్ వెడ్డింగ్ తరహాలో పరిణీతి రాఘవ్ చద్దా వివాహం జరగడం విశేషం. లీలా ప్యాలెస్ రాయల్ వెడ్డింగ్‌కి కేరాఫ్. సెలబ్రిటీలు, అత్యంత సంపన్నులు మాత్రమే ఇందులో మ్యారేజ్ చేసుకోగలరు.
ఇక పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహానికి ఇద్దరు సీఎంలు, సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు కావడం విశేషం. ఢిల్లీ సీఎం కేజ్రీవార్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ హాజరయ్యారు. వీరితోపాటు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, సానియా మీర్జా, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ప్రియాంక చోప్రా అన్ని దగ్గరుండి చూసుకుంది. సానియా మీర్జా సైతం అన్నీ తానై వ్యవహరించడం విశేషం.
అయితే వీరిద్దరి వివాహం అత్యంత భద్రతతోపాటు నిబంధనలతో జరుగుతుంది. ఎలాంటి ఫోటోలుగానీ, వీడియోలుగానీ లీక్ కావడానికి వీలు లేకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో మ్యారేజ్ జరిగినా ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు అధికారికంగా పోస్ట్ చేస్తేనే ఈ జంట పెళ్లిలో ఎలా ఉంటారో తెలుస్తుంది.
ఈ పెళ్లి మూడు రోజులుగా జరుగుతుంది. ఈ నెల 22న ఇరు కుటుంబాలు ఉదయ్ పూర్‌కి చేరుకున్నారు. అంతకు ముందు ఢిల్లీ అర్దాస్ వేడుకలో పాల్గొన్నారు. శుక్రవారం మెహందీ వేడుక నిర్వహించారు. నిన్న సాయంత్రం నుంచి పెళ్లి వేడుక ప్రారంభమైంది. ఈ సాయంత్రం మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటయ్యారు.
రాఘవ్, పరిణీతి ఒకే స్కూల్ చదువుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్ పరిణీతి రాణిస్తుంది. మరోవైపు రాఘవ్ చద్దా యువ ఎంపీగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు కలిసేతిరుగుతున్నారు. ఆ మధ్య పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ని కలిసి తిలకించడం విశేషం.