- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: చాలా దారుణంగా మారిన ప్రేమ్ పరిస్థితి.. కన్నీరుమున్నీరవుతున్న తులసి!
Intinti Gruhalakshmi: చాలా దారుణంగా మారిన ప్రేమ్ పరిస్థితి.. కన్నీరుమున్నీరవుతున్న తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ప్రేమ్ (Prem) తాను సంగీతం నేర్చుకునే మాస్టర్ దగ్గరకి వెళ్లి నేను ఒక పాట రాశాను సార్ అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి అడగకుండానే పాట రాసావా.. రేపు ఆడకుండానే నా చైర్ లో కూర్చుంటావు అని విరుచుకు పడతావు. అంతేకాకుండా పోయి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొనిరా అని అంటాడు. దానికి ప్రేమ్ కూడా సరే తీసుకొస్తాను అని అంటాడు.
ఇది చూస్తే ప్రేమ్ పరిస్థితి బాగా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు తులసి రేపటి లోపు మాకు అద్దెకు ఇల్లు కావాలి అని మేనేజర్ రిక్వెస్ట్ చేస్తుంది. ఈలోపు తులసి (Tulasi) వాళ్ళ కొడుకు అభి అద్దెకు ఇల్లు దొరికింది అని చెబుతాడు. అంతే కాకుండా రెంట్ కూడా తక్కువ అంటాడు. ఇక విషయం తులసి వాళ్ళ మామయ్యకు చెబుతుంది.
మరోవైపు దివ్య (Divya) ఇదివరకు ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా గడిపిన ఆనంద క్షణాలు గుర్తుతెచ్చుకొని ప్రస్తుతం వాళ్ల పరిస్థితి చూసి ఎంతో బాధ పడుతుంది. ఇక ఒకవైపు అభి (Abhi) ఇటువంటి క్రిటికల్ సమయం లో కూడా మా అమ్మకు నేను ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయాను అని సిగ్గుగా ఉంది అని అంకిత కు చెప్పుకొని బాధపడుతాడు.
ఇక తులసి (Tulasi ) ఇల్లంతా చూసుకుంటూ దుఃఖం తో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు అనసుయ (Anasuya) దంపతులు ఈ ఇంట్లో ఎన్నో జరిగాయి అంటూ బాధపడుతూ ఉంటారు. ఇక పరందామయ్య మనం ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సిందే అనసూయ అంటూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు తులసి (Tulasi) దుఖానికి అవధులు ఉండవు.
ఈ లోపు తులసి దగ్గరకు రాములమ్మ (Ramulamma) వచ్చి ఈ ఇల్లు వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టం గానే అనిపిస్తుంది అమ్మా అని అంటుంది. ఇక తులసి (Tulasi) అందరికి భోజనం సిద్ధం చేశావా అందరిని తీసుకొని వస్తాను అని అంటుంది.
ఇక తరువాయి భాగం లో తులసి (Tulasi) కొన్ని బంధాలను తెంచుకోవడం అవసరం అని చెప్పి ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చేస్తుంది. ఇక ప్రేమ్ (Prem) కి ఈ విషయం గురించి తెలుస్తుందో లేదో చూడాలి.