- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: మళ్లీ ఒక్కటైన సామ్రాట్ తులసి.. అనసూయకు బుద్ధి చెప్పిన పరంధామయ్య?
Intinti Gruhalakshmi: మళ్లీ ఒక్కటైన సామ్రాట్ తులసి.. అనసూయకు బుద్ధి చెప్పిన పరంధామయ్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 16 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో నందు తులసి గురించి ఆలోచిస్తూ ఉండగా లాస్య నందుని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి నందు నా మాటలు నచ్చడం లేదా లేకపోతే తులసి మీద ఒపీనియన్ మారిందా అని అంటుంది. అప్పుడు నందు మాటలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు లాస్య అని అంటాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా జాబు గురించి నేను ముంబై వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు లాస్య ఒక మాట కూడా చెప్పలేదు ఎప్పుడు వస్తావు అనడంతో తెలియదు అని అంటాడు నందు. నేను వచ్చేవరకు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు లాస్య ఎందుకు నందు ఇలా మాట్లాడుతున్నాడు ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు అనసూయ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి అమ్మ నేను ముంబై వెళ్తున్నాను అనడంతో వెంటనే అనసూయ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా ఇటువంటి సమయంలో నువ్వు ముంబై వెళ్లడం ఏంటి నందు అనడంతో తప్పదు అమ్మ నేను వెళ్ళాలి అని అంటాడు. నేను ఉండి ఏం చేయాలి అమ్మ నేను మీతో కలిసి బాధపడటం తప్ప నాన్న పట్టుదలతో నాన్న ఉన్నాడు అని అంటాడు నందు. ఇప్పుడు లాస్య తులసి పేరు ఎత్తడంతో వెంటనే నందు సీరియస్ అవుతాడు.
ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు నందు నాన్న మారేవరకు ఎన్ని రోజులైనా ఎదురు చూడాల్సిందే అని అంటాడు. ఇప్పుడు లాస్య, అనసూయని నోరు అదుపులో పెట్టుకోమని చెబుతాడు నందు. అప్పుడు అనసూయ నువ్వు వెళ్లాల్సిందేనా అని అనడంతో అవసరం లేకుండా నేను కూడా ఎందుకు బయలుదేరుతాను అమ్మ అని అంటాడు. అప్పుడు నందు అక్కడనుంచి వెళ్లిపోయిన తర్వాత లాస్య తన మాటలతో అనసూయని రెచ్చ గొడుతూ ఉంటుంది. మరొకవైపు తులసి పూజ చేస్తూ తన మనసులోని మాటలు దేవుడికి చెప్పుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ బయలుదేరుతూ వెళ్తూ ఉండగా అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ కి నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు.
అప్పుడు సామ్రాట్ పరిస్థితులు చేయి దాటి పోయినాక ఆలోచించి ఏం లాభం లేదు బాబాయ్ అని అంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు. మరొక వైపు తులసి బయలుదేరి బయటకు వెళ్తుంది. అనసూయ ఇంట్లో పూజ చేస్తూ అండగా ఇంతలోనే అక్కడికి పరంధామయ్య వస్తాడు. అప్పుడు అనసూయని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుండగా అనసూయ పిలిచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. అప్పుడు పరంధామయ్య తులసి గెంటేసిన విషయం గురించి బాధగా మాట్లాడుతాడు. అప్పుడు అనసూయ పరంధామయ్యతో ఈ వయసులో మనకి మనస్పర్ధలు అవసరమా అని అంటుంది.
అప్పుడు అనసూయ ఈ ఇల్లు మీది ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళు అలాంటిది మీరు గుళ్లో పడుకోవడం అసలు బాగోలేదు అని అంటుంది. మరో వైపు తులసి నడుచుకుంటూ వెళుతుండగా సామ్రాట్ తులసిని చూసి కారు ఆపుతాడు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. అప్పుడు నేను మీ ఇంటి దగ్గరికి బయలుదేరాను అని సామ్రాట్ పడడంతో నేను కూడా బయలుదేరాను అని తులసి. ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది తులసి. అప్పుడు తులసి ఎందుకు మీరు నా గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని అంటుంది. స్నేహం చేయడం అంటే సహాయం చేయడం అన్న విషయం తెలుసు కానీ నా తరపున యుద్ధం చేయటాన్ని ఏమంటారు అని అంటుంది తులసి.
అప్పుడు అదేం లేదు తులసి గారు నా మనసులో ఏ ఉద్దేశం లేదు అని అనడంతో వెంటనే తులసి మనసులో ఎటువంటి ఉద్దేశం లేకుండా ఎవరు ఏమి చేయరు అని అంటుంది. నా గురించి నేను కూడా ఆలోచించనంతగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కొత్తగా కనిపిస్తున్నారు అనడంతో సామ్రాట్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను నిజంగా ఆరాధించే అంత గొప్ప దాన్న అనడంతో వెంటనే సామ్రాట్ నేను వేరే ఉద్దేశంతో అలా అనలేదు తులసి గారు అని అంటాడు. ఇప్పుడు తులసి నేను మీరు మాట్లాడిన మాటలు అని ప్రత్యక్షంగా విన్నాను అంతంతో సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటా నవ్వుతూ మళ్లీ ఒకటవుతారు. స్నేహితులు అందరికీ ఉంటారు కానీ నీలాంటి స్నేహితులు నాకు మాత్రమే ఉంటారు అని అంటుంది.
అప్పుడు వారిద్దరు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మరొకవైపు పరంధామయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు ప్రేమ్ కాఫీ తాగుతూ ఉండగా ఎందుకు ప్రేమ్ అందరూ అలా ఉన్నారు నేను ఇంట్లో నేను లేనప్పుడు గొడవ జరిగిందా అని అడుగుతాడు పరంధామయ్య. అప్పుడు ప్రేమ్ చెప్పబోతుండగా అభి వద్దు అని చెప్పడంతో ప్రేమ్ అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత ప్రేమ్ అక్కడి నుంచి వెళుతుండగా ఎందుకురా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు తాతయ్యకు నిజం చెప్పాలి అనుకుంటున్నావు అనటంతో వెంటనే ప్రేమ్ ఏమి తాతయ్యకు జరిగిన విషయం చెబితే మీ అందరిని అసహ్యించుకుంటాడు అని భయంగా ఉందా అంటాడు ప్రేమ్. మరొకవైపు సంతోషంతో తులసి సామ్రాట్ ఇద్దరూ తింటూ ఉంటారు.