- Home
- Entertainment
- Guppedantha Manasu: లెక్చరర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాండ్యన్.. ప్రమాదపుటంచుల్లో రిషి!
Guppedantha Manasu: లెక్చరర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాండ్యన్.. ప్రమాదపుటంచుల్లో రిషి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన కొడుకుని వదిలి వెళ్ళలేక మదన పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో జగతి దంపతులు బయటికి వచ్చి విశ్వనాధానికి వీడ్కోలు చెప్తారు. అయినవాళ్లని కూడా ఈరోజుల్లో రిషి ని మీ ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటున్నారు యాక్సిడెంట్ అయిన వసుధారని కూడా మీ ఇంట్లో పెట్టుకున్నారు నిజంగా మీరు గ్రేట్ అంటుంది జగతి. అలాగే ఏంజెల్ దగ్గరికి వచ్చి నిజంగా రిషిని సేవ్ చేసినందుకు థాంక్స్ అంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ని నేను సేవ్ చేస్తే మీరు ఎందుకు నాకు థాంక్స్ చెబుతున్నారు మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతుంది ఏంజెల్.
కంగారు పడతారు జగతి, వసుధార. రిషి సార్ చాలా గొప్పవారు కదా అలాంటి వ్యక్తిని సేవ్ చేశారంటే ఎవరైనా ఎమోషనల్ థాంక్స్ చెప్పాల్సిందే అందుకే మేడం కూడా థాంక్స్ చెప్తున్నారు అంటూ కవర్ చేసేస్తుంది వసుధార. అంతేనా మేడం.. నేను ఇప్పటివరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు కానీ మీకు చెప్పాలనిపిస్తుంది రిషి ని ఎప్పటికీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది ఏంజెల్. ఆ మాటలకి ఆనందపడుతుంది జగతి.
తరువాత వసుధార దగ్గరికి వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ గురించి కాస్త ఆలోచించండి మేడం. రిషి సార్ చేత ఎలాగైనా ఒప్పించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. మహేంద్ర కూడా అదే చెప్పాడు.రిషి సార్ కచ్చితంగా మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటారు అని చెప్తుంది వసుధార. ఇంట్లో రిషి లేకపోవడంతో వచ్చాక చెప్పి వెళ్దాము అంటుంది జగతి. బాగోదు పద అని భార్యతో చెప్పి అందరికీ వీడ్కోలు చెప్పి బయటకి వస్తుంటే ఎదురుగా రిషి కనిపిస్తాడు. రిషి ని చూసి ఆనందించి వెళ్లలేక వెళ్లలేక వెళ్ళిపోతారు మహేంద్ర దంపతులు.
మరోవైపు రిషి, వసుధారల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు లెక్చరర్స్. ఆ మాటలు విన్న పాండ్యన్ కోపంతో రెచ్చిపోతాడు. మీరు లెక్చరర్స్ అయి ఉండి ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు. వాళ్లు మీలాగా జీతానికి పనిచేయటం లేదు స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. మీరు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్న కూడా నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అంటే అందుకు కారణం రిషి సార్ నేర్పించిన సంస్కారం.
మరొకసారి రిషి సార్ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నా పాత క్యారెక్టర్ లోకి వెళ్ళవలసి వస్తుంది జాగ్రత్త అని వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు పాండ్యన్. సీన్ కట్ చేస్తే ఇంటి బయట వరండాలో తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు రిషి. అదే సమయంలో పైన వసుధార రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. డాడ్ వాళ్లు రావడం నాకు చిరాకుగా ఉంది కానీ ఎందుకో తెలియని ప్రశాంతంగా ఉంది నా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నా చుట్టూ ఉన్నారు అంటే ఆనందంగా ఉంది అనుకుంటాడు రిషి.
కారణాలు ఏమైనాప్పటికీ నన్ను మోసగాడిగా ముద్ర వేశారు నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. ఆరోజు అలా చేసి ఈరోజు వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోమంటే నేను తీసుకోవాలా.. ఆ బాధ్యతలు నేను చేపట్టను అనుకుంటాడు. అదే సమయంలో రిషి గురించి తలుచుకుంటూ వి ఆర్ అని పేపర్ మీద రాస్తుంది వసుధార. ఆ పేపర్ దానికి ఎగిరి కింద ఉన్న రిషి దగ్గర పడుతుంది. దానిని చించేయాలనుకుంటాడు రిషి కానీ వసుధార వచ్చి దీనిని చించేసి నా మనసుని గాయపరుస్తానంటే ఊరుకోను ఇది నా ప్రేమ అంటుంది.
మీరు ఎదుటివారి మనసు గాయం చేయవచ్చు కానీ మీ మనసు మాత్రం గాయపడకూడదు ఎంత స్వార్థం అంటాడు రిషి. మేము ఎందుకు అలా చేసాము మాకు తెలుసు ప్రేమలో స్వార్థాలు ఉండవు ఇప్పుడు కూడా నేను మీకు నిజం చెప్పొచ్చు కానీ చెప్పను కారణం మీరే తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. పొగరు.. ఎక్కడా తగ్గదు అని మనసులో అనుకుంటూ రిషి కూడా లోపలికి వెళ్ళిపోతాడు.
అప్పుడే పొదల్లోంచి శైలేంద్ర, అతను ఏర్పాటు చేసిన కిల్లర్ బయటికి వస్తారు. వాడు ఇంట్లోనే ఉంటాడు మొహం గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఈ పని ముగించేస్తే నీకు లైఫ్ సైట్ లైఫ్ టైం సెటిల్మెంట్ అంటాడు శైలేంద్ర. నేను అటాక్ చేస్తే మిస్ అవ్వడం ఉండదు అని మొహానికి ముసుకు వేసుకొని విశ్వనాథం ఇంట్లోకి దొంగతనంగా చొరబడతాడు ఆ కిల్లర్. ఆ సమయంలో రిషి హాల్లో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.