MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Panchatantram Movie Review: `పంచతంత్రం` మూవీ రివ్యూ

Panchatantram Movie Review: `పంచతంత్రం` మూవీ రివ్యూ

ఒకే సినిమాలో రెండుకు మించిన కథలు చెబుతున్నారు నేటి మేకర్స్. అప్పట్లో `చందమామకథలు` వచ్చింది. ఇప్పుడు మళ్లీ `పంచతంత్రం` తెరకెక్కింది.  నేడు శుక్రవారం(డిసెంబర్‌9) న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? బ్రహ్మానందం, కలర్స్ స్వాతిలకు కమ్‌ బ్యాక్‌నిచ్చిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

5 Min read
Aithagoni Raju
Published : Dec 09 2022, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ట్రెండ్‌ మారే కొద్ది, టెక్నాలజీ పెరిగే కొద్ది, డిజిటల్‌ విస్తరణ జరిగాక సినిమా రూపాంతరం చెందుతుంది. ఇలానే సినిమా తీయాలనే మూస ధోరణికి బ్రేకులు వేస్తూ కొత్త పుంతలు తొక్కుతుంది. నవ్యతని జోడించుకుని పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో సినిమాలో యాంథాలజీ అనే కాన్సెప్ట్ కూడా ఇటీవల పాపులర్‌ అవుతుంది. ఒకే సినిమాలో రెండుకు మించిన కథలు చెబుతున్నారు నేటి మేకర్స్. అప్పట్లో `చందమామకథలు` వచ్చింది. ఇప్పుడు మళ్లీ `పంచతంత్రం` తెరకెక్కింది. బ్రహ్మానందం, సముద్రఖని, కలర్స్ స్వాతి, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, దివ్య శ్రీపాద వంటి నోటెడ్‌ ఆర్టిస్టులతోపాటు అప్‌కమింగ్‌ ఆర్టిస్టులతో తెరకెక్కిన చిత్రమిది. హర్ష పులిపాక దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేడు శుక్రవారం(డిసెంబర్‌9)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? బ్రహ్మానందం, కలర్స్ స్వాతిలకు కమ్‌ బ్యాక్‌నిచ్చిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. Panchatantram Movie Review

29

కథః
ఇది ఐదు కథల సమాహారం. పంచేంద్రియాల చుట్టూ తిరిగే ఐదు కథలను ఆవిష్కరించే చిత్రం. వేదవ్యాస్‌(బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. ఇంట్లో బోర్‌ కొడుతుండటంతో స్టోరీ టెల్లర్‌గా కొత్త కెరీర్‌ని ప్రారంభించాలనుకుంటాడు. స్టాండప్‌ స్టోరీ టెల్లింగ్‌ పోటీలకు వెళ్లాలనుకుంటాడు. కానీ ఇంట్లో తన కూతురు రోషిణి(కలర్‌ స్వాతి) ఆయన కోరికని అర్థంచేసుకోకుండా నిరుత్సాహపడుతుంది. కామెంట్స్ చేస్తుంటుంది. కూతురిని లెక్కచేయకుండా స్టాండప్‌ స్టోరీ టెల్లింగ్‌ పోటీలకు వెళ్తాడు వేదవ్యాస్‌. అక్కడ పంచేంద్రియాల కాన్సెప్ట్ తో ఐదు కథలు చెబుతాడు.  Panchatantram Movie Review

మొదటి కథః మొదటి స్టోరీ దృశ్యం చుట్టూ తిరుగుతుంది. నరేష్‌ అగస్త్య సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి. మంచి ఉద్యోగం చేస్తున్నా, ఏదో తెలియని అసంతృప్తి. పని ఒత్తిడి కారణంగా ప్రతి చిన్న దానికి అసహనానికి, కోపానికి గురవుతుంటాడు. ఫ్రెండ్స్ ద్వారా బీచ్‌ గురించి వింటాడు. బీచ్‌ గురించి విన్నప్పుడు అతనిలో తెలియని ఉత్సహం కలుగుతుంది. మరి ఆ ఉత్సాహానికి కారణం ఏంటి? బీచ్‌కి దృశ్యానికి సంబంధం ఏంటనేది కథ.

39

రెండో కథః రుచి గురించి తెలియజేసే కథ. రాహుల్‌ విజయ్‌కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అమ్మాయిలు నచ్చక ప్రతిదీ రిజెక్ట్ చేస్తుంటాడు. తనలాంటి అభిరుచి ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో అమ్మ ఒత్తిడి మేరకు చివరగా శివాత్మిక రాజశేఖర్‌ ని చూస్తాడు. పేరెంట్స్ కి నచ్చిందనే ఉద్దేశంతో ఆమెకి ఓకే చెబుతాడు. ఇరు కుటుంబాలు ఓకే అనుకున్నా సమయంలో ఆయనకు శివాత్మిక నుంచి కాల్‌ వస్తుంది. వాళ్లిద్దరు కలుసుకుంటారు. మరి రుచికి, వీరిద్దరు కలుసుకోవడానికి సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

మూడో కథః వాసన గురించి తెలియజేసే కథ.  సముద్రఖని బ్యాంకులో జాబ్‌ చేసి రిటైర్డ్ అవుతాడు. ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఏం చేయాలో తోచదు. తన కూతురు నెలలు నిండడంతో డెలివరీ దగ్గరపడుతుంది. ఆ సమయంలో తనకు బ్లడ్‌ స్మెల్ వస్తుంటుంది. కూతురు డెలివరీకి, సముద్రఖనికి బ్లడ్‌ వాసన రావడానికి సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

49

నాల్గో కథః స్పర్శలోని అనుభూతిని తెలిపే కథ ఇది. వికాస్‌ ముప్పాల, దివ్య శ్రీపాద ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. దివ్య శ్రీపాద ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సడెన్‌గా ఓ రోజు ఆమెకి బ్లీడింగ్‌ అవుతుంది. ఆసుపత్రికి వెళ్లగా క్యాన్సర్‌ గా తేలుతుంది. తల్లి బిడ్డలకు ప్రమాదం. ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేదు. మరి వికాస్‌, దివ్య శ్రీపాద తీసుకున్న నిర్ణయమేంటి? స్పర్శకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ. 

ఐదో కథః వినికిడిలోని గొప్పతనం తెలియజేసే కథ ఇది. లియా అనే పేరుతో చిన్న పిల్లల స్టోరీస్‌ చెబుతుంది కలర్స్ స్వాతి. వాటికి ఎంతో మంది చిన్నారులు అభిమానులుగా మారిపోతుంటారు. అలా ఉత్తేజ్‌ కూతురు కూడా పెద్ద ఫ్యాన్. ఆ లియా కథ వినందే అన్నం తినదు. స్వాతికి, ఉత్తేజ్‌ కూతురుకి ఉన్న సంబంధం ఏంటి? ఉత్తేజ్‌ కూతురు స్వాతిలో తెచ్చిన మార్పేంటి? వినికిడి పోషించిన పాత్ర ఏంటనేది మిగిలిన కథ. ఈ ఐదు కథలు చెప్పడం వల్ల వేదవ్యాస్‌ జీవితం ఎలా మారిందనేది సినిమా కథ. 

59

విశ్లేషణః

ఓ పోయెటిక్‌ సెన్స్ లో తీసిన చిత్రమిది. కమర్షియల్‌ అంశాలు అతీతంగా ఒక ఫీల్‌ని, పంచేంద్రియాలను థీమ్‌గా తీసుకుని కథ అల్లుకున్నాడు దర్శకుడు హర్ష పులిపాక. మన చుట్టూ నిత్యం జరిగే విషయాలను, సంఘటనలనే కథా వస్తువులుగా ఎంచుకుని తెరక్కించిన తీరు బాగుంది. మొదటగా ఇలాంటి ఐడియాతో సినిమా తీయాలనే దర్శకుడి ఆలోచనకు శెబాష్‌ కొట్టాల్సిందే. ఐదు కథలను అల్లుకున్న తీరు, వాటికి పంచేంద్రియాల కాన్సెప్ట్ ముడిపెట్టిన తీరు బాగుంది. అయితే కథల పరంగా చూస్తే అన్ని కథల అడియెన్స్ ని అంతటి ఫీల్‌కి గురి చేయలేకపోయాయి. మొదటి కథలో ఫీల్‌ మిస్‌ అయ్యింది. దీంతో ఆ స్టోరీతో ఆడియెన్స్ ట్రావెల్‌ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రారంభమే కాబట్టి ఆడియెన్ దానికి కనెక్ట్ కాలేకపోతారు. ఇక రెండో కథ రాహుల్‌ విజయ్‌, శివాత్మిక ల స్టోరీ నుంచి కథలో ఫీల్‌ స్టార్ట్ అవుతుంది. అది ఆడియెన్స్ సైతం ఫీలయ్యేలా చేస్తుంది. మూడో కథ అయిన సముద్రఖని ఎపిసోడ్‌ కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. ఆయనకు వచ్చే స్మెల్‌కి, తన కూతురు డెలివరీకి, తన గతానికి ముడిపెట్టిన తీరు బాగున్నప్పటికీ అంతటి ఫీల్‌ని తీసుకురాలేకపోయింది. Panchatantram Movie Review

69

ఇక నాల్గో కథ హృదయాన్ని బరువెక్కిస్తుంది. దిశ్య శ్రీపాద, వికాస్‌ ముప్పాల జంట తమ పేరెంట్స్ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను, క్యాన్సర్‌ తో పోరాటం, ఆర్థిక ఇబ్బందులతో వారిలో జరిగే సంఘర్షణ ఆకట్టుకుంటుంది. హృదయానికి హత్తుకుంటుంది. కథ కథకి ఎమోషన్స్ ని, ఆ ఫీల్‌ని పెంచుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఐదో కథకి వచ్చేసరికి దాన్ని మరింత పీక్‌లోకి తీసుకెళ్లాడు. కలర్స్ స్వాతి, రూప అనే చిన్నారి మధ్య పెట్టిన సన్నివేశాలు, రూప పాత్రలోని ట్విస్ట్ ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఓ బరువెక్కిన హృదయంతో ఆడియెన్స్ బయటకు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు ఈ ఐదు కథలను, వేద వ్యాస్‌ అనే పాత్ర ద్వారా ముడిపెట్టిన తీరు బాగుంది. క్లైమాక్స్ అదరగొడుతుంది. అయితే సినిమా కాస్త స్లోగా సాగడం ఆడియెన్స్ ఓపికకి పరీక్ష పెట్టే అంశం. ఇలాంటి సినిమాలకు థియేటర్లలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చెప్పలేంగానీ, ఓటీటీకి మాత్రం బెస్ట్ ఛాయిస్‌. 

79

నటీనటులుః
బ్రహ్మానందం ఇటీవల అడపాదడపా పాత్రల్లో కనిపిస్తున్నారు. కామెడీ పాత్రల్లో కనిపించే ఆయనకు ఇదొక డిఫరెంట్‌ రోల్‌. సీరియస్‌ రోల్స్ లోకి టర్న్ తిప్పే సినిమా అవుతుంది. ఇక ఆయన నటన గురించి చెప్పేదేం లేదు. నవ్విస్తున్నట్టే అనిపించి హృదయాన్ని బరువెక్కించాడు. కలర్స్ స్వాతికిది కమ్‌ బ్యాక్ లాంటి సినిమా అవుతుంది. ఆమె పాత్రకి ప్రాణం పోసింది. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక, అగస్త్య తమ పాత్రల మేరకు డీసెంట్‌గా బాగా చేశారు. సముద్రఖని నటనతో తన కథని నిలబెట్టారు. దివ్య శ్రీపాద, వికాస్‌  అద్భుతంగా చేశారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, ఉత్తేజ్‌, రూప పాత్రలో చిన్నారి సైతం బాగా చేశారు. నటీనటులే సినిమాకి పెద్ద బలం. Panchatantram Movie Review

89

టెక్నీషియన్లుః
దర్శకుడు హర్ష పులిపాక ఈ ఐడియాతోనే సక్సెస్‌ అయ్యాడు. అయితే స్టో నెరేషన్‌, వినోదం లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. ఆ అంశాలపై దృష్టిపెట్టాల్సింది. అదే సమయంలో మొదటిది, మూడో కథలో మరింత ఫీల్‌ని, ఎమోషన్స్ ని జోడించి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఒకదాని తర్వాత వచ్చే మరో కథకి భావోద్వేగాలను పెంచుకుంటూ వెళ్లిన తీరు బాగుంది. స్టోరీ టెల్లర్‌గా ఆయనకు మంచి భవిష్యత్‌ ఉంది. సంగీతం, బీజీఎం సినిమాకి ప్రాణం. ప్రశాంత్‌ ఆర్‌ విహారి, శ్రవణ్‌ భరద్వాజ్‌ బాగా చేశారు. రాజ్‌ కె నల్లి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ డీసెంట్‌గా, రిచ్‌గా ఉన్నాయి. నిర్మాతలు అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు బాగా ఖర్చు చేసి చేశారు. రిచ్‌గా తెరకెక్కించారు.  Panchatantram Movie Review

99

ఫైనల్‌ గాః  పొయెటిక్‌ టచ్‌ ఉన్న మంచి ఫీల్‌గుడ్‌ మూవీ. 

రేటింగ్‌ః 2.75


బ్యాన‌ర్స్‌: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక, లైన్ ప్రొడ్యూసర్: సునిత పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియం, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి,  పి.ఆర్‌.ఓ:  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Recommended image2
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
Recommended image3
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved