MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లైవ్ లో శివాజీకి పల్లవి ప్రశాంత్ ఫోన్.. దెబ్బకు సుమ షాక్, వేదిక దద్దరిల్లిపోయిందిగా

లైవ్ లో శివాజీకి పల్లవి ప్రశాంత్ ఫోన్.. దెబ్బకు సుమ షాక్, వేదిక దద్దరిల్లిపోయిందిగా

బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ కి ఎప్పుడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వాళ్ళు ఊహించని విధంగా క్రేజీ సెలెబ్రిటీలు అయిపోయారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 10 2024, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ కి ఎప్పుడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వాళ్ళు ఊహించని విధంగా క్రేజీ సెలెబ్రిటీలు అయిపోయారు. శివాజీ ఆల్రెడీ పాపులర్ ఐయినప్పటికీ బిగ్ బాస్ తర్వాత అతడి క్రేజ్ రెట్టింపు అయింది అని చెప్పొచ్చు. పల్లవి ప్రశాంత్ చుట్టూ వివాదాలు నెలకొనడం, అతడు అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల కావడం చకచకా జరిగిపోయాయి. 

26

శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ బిగ్  బాస్ హౌస్ లో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారో తెలిసిందే. శివాజీ ప్రోత్సాహంతోనే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచారని చాలా మంది నమ్ముతున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి బాండింగ్ కొనసాగుతోంది. శివాజీ హౌస్ నుంచి రాగానే తాను నటించిన వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ మొదలయింది. 

36

శివాజీ, తొలిప్రేమ ఫేమ్ వాసుకి ఈ వెబ్ సిరీస్ లో భార్య భర్తలుగా నటించారు. 90 దశకం నాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల పరిస్థితులని ప్రతిభింబించేలా ఈ వెబ్ సిరీస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ, వాసుకి, అలాగే చైల్డ్ ఆర్టిస్ లు సుమ అడ్డా షోకి హాజరయ్యారు. 

 

46

ఎవ్వరితో అయినా కామెడీ పంచ్ లతో రెచ్చిపోయే సుమ.. శివాజితో కూడా హంగామా చేసింది. అతడితో కలసి చిన్నపాటి రొమాన్స్ కూడా చేసింది. శివాజీకి లైవ్ లో ఫోన్ వస్తే.. ఎవరో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాఅంటూ చూసింది. కానీ శివాజీకి ఫోన్ చేసింది పల్లవి ప్రశాంత్. లైవ్ లో ఫోన్ చేయడంతో సుమ ఆశ్చర్యపోయింది. 

 

56

అక్కడున్న ఆడియన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ఫోన్ చేయగానే మామూలు హంగామా చేయలేదు. ఒక్కసారిగా వేదిక దద్దరిల్లిపోయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్ మధ్య సాన్నిహిత్యం అంతలా ఉంది మరి. 

 

66
Sivaji

Sivaji

మార్నింగ్ మిమ్మల్ని పార్క్ లో చూశాను అని శివాజీ సుమతో ఫ్లట్ చేస్తాడు. నేను పార్క్ కి వెళ్ళలేదు కదండీ అంటుంది. దీనితో శివాజీ మీరు నెమలిలా ఉంటే మీరే అనుకున్నా అంటాడు. సుమ సిగ్గుపడుతూ కనిపించింది. చాలా ఫన్నీగా సుమ అడ్డా ప్రోమో సాగింది. జనవరి 13న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved