MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies:థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్న శ్రీవిష్ణు.. క్రేజీ యాక్షన్ మూవీస్, సిరీస్ లతో ఈ వారం ఓటీటీలో పండగే

OTT Movies:థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్న శ్రీవిష్ణు.. క్రేజీ యాక్షన్ మూవీస్, సిరీస్ లతో ఈ వారం ఓటీటీలో పండగే

మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు OTT వేదికలపై విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు హీరో శ్రీవిష్ణు నటించిన ఒక క్రేజీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 30 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు OTT వేదికలపై విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు, హిందీ కామెడీ డ్రామాలు, కొరియన్ సిరీస్‌లు, తెలుగు చిత్రాలు ఇలా విభిన్న జానర్లలో కంటెంట్ విడుదల కానుంది. తెలుగు నుంచి శ్రీవిష్ణు నటించిన థ్రిల్లర్ మూవీతో పాటు మరి కొన్ని ఇతర చిత్రాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో వినోదం అందించనున్నాయి.

26
నెట్‌ఫ్లిక్స్
Image Credit : Asianet News

నెట్‌ఫ్లిక్స్

Happy Patel Khatarnak Jasoos

వీర్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ ప్రారంభించనుంది. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున విడుదల కావడం విశేషం. ఇమ్రాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 1, 2026

Bloodhounds

2023లో విడుదలై మంచి స్పందన పొందిన కొరియన్ బాక్సింగ్ రివెంజ్ సిరీస్ రెండో సీజన్ ఇది. వూ డో హ్వాన్, లీ సాంగ్ యి మళ్లీ గన్ వూ, వూ జిన్ పాత్రల్లో కనిపిస్తారు.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 3, 2026

High Tides Knokke Off

బెల్జియన్ డ్రామా సిరీస్ మూడో మరియు చివరి సీజన్ ఏప్రిల్ 3న విడుదల కానుంది. నోక్కే ప్రాంతంలో నివసించే ధనికుల జీవితాలను చూపిస్తుంది.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 3, 2026

Vadh 2

సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 3, 2026

Mrithyunjay

శ్రీ విష్ణు, రేబా మోనికా జాన్ నటించిన ఈ థ్రిల్లర్ కథలో హంతకుడు, జర్నలిస్ట్ మధ్య జరుగుతున్న సంఘటనలు ప్రధానాంశం. పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 4, 2026

Related Articles

Related image1
ఉస్తాద్ ఫ్లాప్ కి 5 కారణాలు ఇవే.. సూపర్ హిట్ కావాల్సిన సినిమాని అదొక్కటే కొంప ముంచిందా ?
Related image2
నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్
36
ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

ప్రైమ్ వీడియో

Ma Ka Sum

19 ఏళ్ల గణిత ప్రతిభావంతుడు తన తల్లికి సరైన జీవిత భాగస్వామిని కనుగొనడానికి అల్గారిథమ్ రూపొందించే కథ. మిహిర్ అహుజా, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 4, 2026

46
Sun NXT
Image Credit : Asianet News

Sun NXT

Vadam

తమిళ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, OTTలో కొత్త అవకాశాన్ని చూస్తోంది.

ఎక్కడ చూడాలి: సన్ ఎన్ ఎక్స్ టి 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 3, 2026

56
సోనీ లివ్
Image Credit : instagram

సోనీ లివ్

Sitaare Zameen Par

2025లో విడుదలైన ఈ చిత్రం దాదాపు 10 నెలల తర్వాత OTTలోకి వస్తోంది. ముందుగా యూట్యూబ్‌లో పే పర్ వ్యూ రూపంలో అందుబాటులో ఉండగా, ఇప్పుడు సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి రానుంది.

ఎక్కడ చూడాలి: సోనీ లివ్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 3, 2026

66
జియోహాట్‌స్టార్
Image Credit : Asianet News

జియోహాట్‌స్టార్

Five Nights At Freddys 2

ప్రసిద్ధ వీడియో గేమ్ ఆధారంగా రూపొందిన హాలీవుడ్ హారర్ చిత్రం. 2023 హిట్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు OTTలోకి రానుంది.

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 5, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ సినిమాపై రూమర్స్.. మహేష్ బాబు మీమ్ తో డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై , హీరోయిన్ విషయంలోనే రచ్చ
Recommended image2
Kriti Sanon: యూకే కుర్రాడితో మహేష్ హీరోయిన్ పెళ్లి ? ఎవరీ కబీర్ బహియా.. అసలు విషయం ఇదే!
Recommended image3
Dia Mirza Struggle: వరుసగా సినిమాలు ఫ్లాప్, ఐరన్ లెగ్ అని అవమానించారు.. హీరోయిన్ ఆవేదన
Related Stories
Recommended image1
ఉస్తాద్ ఫ్లాప్ కి 5 కారణాలు ఇవే.. సూపర్ హిట్ కావాల్సిన సినిమాని అదొక్కటే కొంప ముంచిందా ?
Recommended image2
నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved