MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ott Releases: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 21న బుల్లితెరపై సినిమాల పండగ

Ott Releases: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. 21న బుల్లితెరపై సినిమాల పండగ

ఈ వీక్  థియేటర్స్ లో సినిమా రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేనట్టే. కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ.డిసెంబర్ క్రేజీ రిలీజెస్ అన్నీ ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫాంపై దూకుడు చూపించబోతున్నాయి. స్మాల్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేయబోతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 19 2022, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ శుక్రవారం బుల్లి తెరపై పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి.థియేటర్ రిలీజ్ కు చిన్న సినిమాలు వస్తుండగా.. పెద్ద సినిమాలు మాత్రం ఆల్ రెడీ థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఆ హీట్ తగ్గడంతో.. ఓటీటీకి చేరుతున్నాయి. ఇప్పటికే పుష్ప ఓటీటీలో రిలీజ్ అయ్యి.. రచ్చ చేసింది. ఇక మరికొన్ని సినిమాలు 21న డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఎప్పుడో డిసెంబర్ లో రిలీజ్అయ్యింది బాలయ్య బాబు(Balakrishna) అఖండ మూవీ.  థియేటర్స్ లో ఇంకా దుమ్మురేపుతూనే ఉంది.  అఖండ(Akhanda) ఇక బుల్లి తెరపై సందడి చేయబోతోంది. జనవరి 21న ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ మూవీగా థియేటర్స్ కి వచ్చి 100కోట్లను అవలీలగా సాధించేసింది మూవీ. అఖండ థియేటర్ హడావిడి అయిపోతుండటంతో.. ఇక బుల్లితెరను టార్గెట్ చేసుకుంది. అఖండ ఈ 21నహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అఖండగా బాలయ్య(Balakrishna )ను చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇక ఓటీటీల్లో కూడా ఈరికార్డ్స్ ను క్యారీ చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.

35

సౌత్ నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది నానీ(Nani) శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజైన అన్ని భాషల్లో  నానికి హిట్టించిన సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని డ్యూయల్ రోల్ లో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈమూవీని  రాహుల్ సాంకృత్యన్(Rahul) డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 24నథియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోన్న సినిమా.. 2021ఎండింగ్ లో మంచి  కలెక్షన్స్ సాధించింది. ఇక జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది శ్యామ్ సింగ రాయ్.

45

ఈ వారం నెట్ ఫ్లిక్స్ చాలా కొత్త కంటెంట్ ను ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ది పప్పట్ మాస్టర్ షో తో పాటూ టూ హాట్ టు హ్యాండిల్ సీజన్ 3కి ఈ ఫ్రైడే వెల్కమ్ చెబుతోంది. రొమాంటిక్ కామెడీ ది రాయల్ ట్రీట్ మెంట్...హిస్టారికల్ థ్రిల్లర్ మునిచ్.. ది ఎడ్జ్ ఆఫ్ వార్.... ఓజార్క్ సీజన్ 4, సమ్మర్ హీట్... ఇలా ఈ వీక్ ఫుల్ హాట్ కంటెంట్ తో హల్చల్ చేయబోతుంది నెట్ ఫ్లిక్స్.

55

హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ షోతో పాటూ బిలియన్స్ సీజన్ 6 షో హాట్ స్టార్ లో 21న రిలీజ్ కాబోతుంది. అన్ పాజడ్ నయా సఫర్, ఎ హీరో వంటి సినిమాలతో ప్రైమ్ ఎంగేజ్ చేయబోతుంది. సోనీలివ్ లో భూతకాలమ్, జీ5లో లూజర్ సీజన్2, ముదాల్ నీ ముదివమ్ నీ వంటి ప్రాజెక్ట్స్ ఈ వారమే వచ్చేస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved