- Home
- Entertainment
- OTT Movies: ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లు.. అందరిలో ఉత్కంఠ రేపుతున్న మూవీ అదే
OTT Movies: ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లు.. అందరిలో ఉత్కంఠ రేపుతున్న మూవీ అదే
August OTT Movies: ఆగష్టులో కొన్ని ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఓ పొలిటికల్ డ్రామా చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఓటీటీ చిత్రాలు
ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ కోసం ప్రేక్షకులు చాలా రోజుల ముందు నుంచే ఎదురుచూస్తున్నారు. ఆగష్టు లో ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు చిత్రాలు, వెబ్ సిరీస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
KNOW
అరేబియా కడలి
నటుడు సత్యదేవ్, హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ సిరీస్ ఆగష్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ వెర్షన్స్ ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
కానిస్టేబుల్ కనకం
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈటీవీ విన్ ఓటీటీలో ఆగష్టు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రశాంత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు.రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.
3 బీహెచ్‌కే
సిద్ధార్థ్, చైత్ర జె ఆర్చర్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన 3 బీహెచ్‌కే చిత్రం జూలై 4న థియేటర్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆగష్టు 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మయసభ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం, స్నేహం ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ మయసభ. సోనీ ఓటీటీలో ఆగష్టు 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. దేవకట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. వైఎస్సార్ పాత్రలో చైతన్య రావు, చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. వీరి పాత్రల పేర్లని ట్రైలర్ లో రెడ్డి, నాయుడు అని చూపించారు. సినీ రాజకీయ వర్గాల్లో ఈ సిరీస్ ఉత్కంఠని రేకెత్తిస్తోంది.
తమ్ముడు
నితిన్ నటించిన తమ్ముడు చిత్రం జులై 4న విడుదలై దారుణమైన పరాజయం ఎదుర్కొంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. లయ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆగష్టు 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అక్కకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే తమ్ముడిగా నితిన్ ఈ చిత్రంలో నటించారు.