Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బాబాయ్ కోసం అబ్బాయ్ హీరోయిన్, అఖండ 2లో ఛాన్స్.. 5 చిత్రాల్లో 4 హిట్లు కొట్టిన క్రేజీ బ్యూటీ

బాబాయ్ కోసం అబ్బాయ్ హీరోయిన్, అఖండ 2లో ఛాన్స్.. 5 చిత్రాల్లో 4 హిట్లు కొట్టిన క్రేజీ బ్యూటీ

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే 100 శాతం హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు.

tirumala AN | Published : Jan 24 2025, 03:49 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే 100 శాతం హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే అఖండ 2 కూడా మొదలైంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

23
Asianet Image

ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఆల్రెడీ ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో హీరోయిన్ కి కూడా ఆస్కారం ఉందట. దీనితో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సంయుక్త మీనన్ ని మరో హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందా లేక కీలక పాత్రలో కనిపిస్తుందా అనేది చూడాలి. 

33
Asianet Image

సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అయింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారలో నటించింది. అది కూడా సూపర్ హిట్. ధనుష్ కి జోడిగా నటించిన సార్, సాయిధరమ్ తేజ్ తో నటించిన విరూపాక్ష చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కళ్యాణ్ రామ్ తో మరోసారి నటించిన డెవిల్ మాత్రం నిరాశ పరిచింది. మొత్తంగా అబ్బాయితో నటించిన సంయుక్త మీనన్ బాబాయ్ తో నటించేందుకు రెడీ అవుతోంది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
నందమూరి బాలకృష్ణ
 
Recommended Stories
Top Stories