MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Liger: అత్యాచారాలు ప్రేరేపించేలా.. విజయ్ దేవరకొండ 'లైగర్' పై మరో షాకింగ్ ట్రోలింగ్ ?

Liger: అత్యాచారాలు ప్రేరేపించేలా.. విజయ్ దేవరకొండ 'లైగర్' పై మరో షాకింగ్ ట్రోలింగ్ ?

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2022, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అటు పూరి జగన్నాధ్, ఇతి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఆగష్టు 25న రిలీజ్ అవుతోంది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రానికి నెలకొన్న సాలిడ్ బజ్ టీంని సంతోష పెడుతుంటే.. మరోవైపు అనవసరంగా చెలరేగుతున్న కాంట్రవర్సీలు కలవరపెడుతున్నాయి. లైగర్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపైన్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ కల్చర్ చెలరేగుతోంది. ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా చిత్రం కూడా ఈ బాయ్ కాట్ కల్చర్ కి బలైంది. 

36

ఇప్పుడు లైగర్ పై కూడా ఆ ట్రెండ్ మొదలు పెట్టారు. కానీ లైగర్ అభిమానులు ధీటుగా బాయ్ కాట్ ట్రెండ్ ని తిప్పికొడుతూ సపోర్ట్ చేస్తున్నారు. తెలుగులో లైగర్ చిత్రానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ హిందీ రిలీజ్ పై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. 

 

46

కరణ్ జోహార్ పై వ్యతిరేకతతోనే లైగర్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది పక్కన పెడితే ఈ చిత్రంలో మరో అంశంపై ట్రోలింగ్ జరుగుతోంది. లైగర్ చిత్రంలోని 'ఆఫట్' అనే సాంగ్ ఇటీవల రిలీజ్ చేశారు. రొమాన్స్ ప్రియులని ఈ సాంగ్ విపారీతంగా ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాధ్ చిత్రం అన్నాక ఇలాంటి రొమాంటిక్ నంబర్స్ తప్పకుండా ఉంటాయి. 

56

ఈ సాంగ్ లో అనన్య పాండే, విజయ్ దేవరకొండ రొమాన్స్ తో రెచ్చిపోయారు. అయితే ఈ సాంగ్ లో వస్తున్న కొన్ని లిరిక్స్ అత్యాచారాలని ప్రేరేపించే విధంగా ఉన్నాయని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'భగవాన్ కేలియే ముజే చోడ్ దో' అనే లిరిక్స్ రేప్ సన్నివేశాలని తలపించేలా ఉన్నాయని.. రొమాంటిక్ సాంగ్ లో ఇలాంటి లిరిక్స్ ఉండడం వల్ల అత్యాచారాలని ప్రేరేపించినట్లు అవుతుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. 

66

అయితే ఈ విషయంలో కూడా లైగర్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. బాలీవుడ్ లో అంతకి మించేలా అసభ్యకరమైన చిత్రాలు ఎన్నో వస్తున్నాయి. కానీ లైగర్ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. కేవలం సాంగ్ లో మాత్రమే రొమాన్స్ చూపించారు. అందులో తప్పేముంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved