- Home
- Entertainment
- ఎన్టీఆర్ నటన చూసి ఏడ్చేసిన ఇంగ్లీష్ పిల్ల.. తారక్ పై ఒలీవియా ప్రశంసలు, బాయ్ ఫ్రెండ్ తో కలిసి..
ఎన్టీఆర్ నటన చూసి ఏడ్చేసిన ఇంగ్లీష్ పిల్ల.. తారక్ పై ఒలీవియా ప్రశంసలు, బాయ్ ఫ్రెండ్ తో కలిసి..
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ 1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది.

RRR Movie
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ 1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు.
RRR Movie
ప్రతి సన్నివేశంలో ఇద్దరి అద్భుతమైన నటన, రాజమౌళి పర్ఫెక్షన్ ని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన కంటతడి పెట్టించే విధంగా ఉంది. రాంచరణ్ అల్లూరి పాత్రలో పవర్ ఫుల్ గా నటించాడు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా అలియా భట్.. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు.
RRR Movie
ఇంగ్లీష్ పిల్ల ఒలీవియా మోరిస్ తన క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించడంతో మీడియా ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతోంది. హాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ సౌండ్ గట్టిగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
RRR Movie
ఓ ఇంటర్వ్యూలో ఒలీవియా మోరిస్ ఆర్ఆర్ఆర్ విజయం సాధిచడం తో తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. ఒలీవియా మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నా బాయ్ ఫ్రెండ్ తో కలసి చూశా. ఈ చిత్రంలో ఎన్నో సన్నివేశాలకు తాను ఎమోషనల్ అయినట్లు ఒలీవియా పేర్కొంది.
RRR Movie
ముఖ్యంగా కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన చూసి తాను ఏడ్చేశానని ఒలీవియా పేర్కొంది. ఎన్టీఆర్ అమేజింగ్ పర్సన్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ఒలీవియా మోరిస్ ప్రశంసలు కురిపించింది.
RRR Movie
ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ తన బాయ్ ఫ్రెండ్ కు బాగా నచ్చిందని తెలిపింది. ఆ సాంగ్ లో స్టెప్పులని తన బాయ్ ఫ్రెండ్ ఇంకా ట్రై చేస్తున్నట్లు ఒలీవియా పేర్కొంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్నో మంచి అనుభవాలని మిగిల్చినట్లు చెప్పింది. ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ లో నేను 20 రోజులు ఉన్నా. కానీ సిటీ మొత్తం చూసే అవకాశం రాలేదు. కొన్ని ప్రాంతాలు మాత్రం చూశానని ఒలీవియా తెలిపింది.