- Home
- Entertainment
- `ఓజీ` అంటే అసలు అర్థం ఇదే.. పవన్‌ని సుజీత్ ఈ రేంజ్‌లో చూపిస్తున్నాడా? మెంటల్ ఎక్కించే విషయాలు లీక్..
`ఓజీ` అంటే అసలు అర్థం ఇదే.. పవన్‌ని సుజీత్ ఈ రేంజ్‌లో చూపిస్తున్నాడా? మెంటల్ ఎక్కించే విషయాలు లీక్..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రంలో `ఓజీ`పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సినిమా టైటిల్ అసలు అర్థమేంటో తెలిసిందే. ఇదిప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న సినిమాల్లో మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ `ఓజీ`. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఆయన ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. మరో రెండు నెలలు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.
`ఓజీ` అంటే అర్థమేంటనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. `దే కాల్ హిమ్ ఓజీ` అంటూ ట్యాగ్ లైన్ ఇస్తున్నారు మేకర్స్. కానీ దాని అర్థమేంటనేది క్లారిటీ లేదు. ఇది కొరియన్ పదం అని, జపాన్ వర్డ్ అంటూ ప్రచారం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సినిమా సాగుతుందని, ఇందులో పవన్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఆ మధ్య హంటింగ్ చితా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ పూనకాలు తెప్పించేలా ఉంది. ఇప్పటి వరకు పవన్‌ని ఇలా చూడలేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే `ఓజీ` అంటే అర్థమేంటనేది ఇప్పుడు వైరల్‌గా మారింది. అది పవన్ కళ్యాణ్ పాత్రని ప్రతిబింబిస్తుందని, ఆయన పాత్ర నేమ్ అని తెలుస్తుంది. `ఓజీ` అంటే ఓజాస్ గాంభీర. అది సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు అట. ఈ పేరుతో సినిమాలో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో పవన్ పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయట. 80, 90 లో మాఫియా డాన్‌గా, యూనియన్ లీడర్‌గా, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా కనిపిస్తారట.
సినిమాలో ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుందని, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందట. దాని ప్రకారమే క్లైమాక్స్ ని డిజైన్ చేస్తున్నారట దర్శకుడు సుజీత్.ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకు వస్తున్నారు. రెండో పార్ట్ లో మెయిన్ స్టోరీ ఉంటుందట. పవన్ పాత్ర బ్యాక్‌స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ముంబయి,హైదరాబాద్ రెండేసి షెడ్యూల్స్, పూణేలో ఒకటి, కాకినాడలో మరో షెడ్యూల్ పూర్తయ్యింది.
Pawan kalyan OG Glimpse
ఇంకా పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన 20రోజుల కాల్షీట్ల పార్ట్ ఉందట. ఇందులో ఒక ఫారెన్ షెడ్యూల్, రెండు ఫైట్లు, ఒక సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. మెయిన్ కాస్టింగ్ మధ్య టాకీ పార్ట్ పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ పవన్ వస్తే షూట్ చేయాలని భావిస్తున్నారు. ఉన్న సాంగ్ పవన్ పాత్ర తీరుతెన్నులపై ఉంటుందని అంటున్నారు. ఒవరాల్‌గా ఈ మూవీ పవన్ గత చిత్రాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. రేపు థియేటర్లలో మూవీ మెంటల్ ఎక్కించేలా ఉంటుందని అంటున్నారు.
ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, వెంకట్ బచ్చు, అజయ్ ఘోష్, మొట్ట రాజేందర్, జీవా, హరీష్ ఉత్తమన్, శాన్ కక్కర్, అభిమన్యు సింగ్, కుమనన్ సేతురామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు.