MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!

OG Movie:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు. ఓజీ సినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

2 Min read
Author : Rajesh K
Published : Sep 18 2025, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓజీపై భారీ అంచనాలు
Image Credit : Asianet News

ఓజీపై భారీ అంచనాలు

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓజీ’(OG). గ్యాంగ్ స్టార్ మూవీ తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న క్రమంలో ప్రమోషన్లు వేగం పెంచింది చిత్ర బృందం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలు
Image Credit : Asianet News

ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ రిలీజ్ కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. బుధవారం విడుదల చేసిన జీవో ప్రకారం సెప్టెంబర్ 25న రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరను రూ. 1000 (జీఎస్టీ సహా)గా నిర్ణయించింది. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేటు పైగా ₹125 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే.. మల్టీప్లెక్స్‌లు టికెట్ రేటు పైగా ₹150 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఓజీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

35
తెలంగాణలో సస్పెన్స్
Image Credit : Asianet News

తెలంగాణలో సస్పెన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక జీవో జారీ చేసింది. కానీ, తెలంగాణలో మాత్రం టిక్కెట్ల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఇంకా స్పష్టంగా లేదు. హై టికెట్ ధరల పెంపు, మిడ్నైట్ షోలపై తెలంగాణ నుంచి పాజిటివ్ సమాధానం వస్తుందా అనే ప్రశ్నపై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కూడా టిక్కెట్ ధరల పెంపు, బెనిఫిట్, ప్రిమియర్స్ కు అనుమతులు ఇస్తే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. గ్రీన్ సిగ్నల్ వస్తే, ఓజీ నిజంగా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

45
ఓజీ స్పెషల్ అట్రాక్షన్స్
Image Credit : Youtube print shot/ Sony Music South

ఓజీ స్పెషల్ అట్రాక్షన్స్

పవర్ స్టార్ ఓజీ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో ఓజాస్ అనే పవర్ పుల్ రోల్ లో కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓమీ అనే విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ గ్యాంగ్ స్టార్ మూవీకి సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. ప్రత్యేకంగా జపాన్‌ సంప్రదాయ వాయిద్యం ‘కోటో’ను ఉపయోగించి కొత్త తరహా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ రికార్డింగ్‌ను లండన్‌లోని ప్రఖ్యాత స్టూడియోలో 117 మంది సంగీతకారులు కలిసి చేశారు. దీంతో ఈ సినిమాలో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

55
ఫెస్టివల్ సీజన్ ఎక్స్ ట్రా బూస్ట్
Image Credit : Youtube print shot/ Sony Music South

ఫెస్టివల్ సీజన్ ఎక్స్ ట్రా బూస్ట్

ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూవీ విడుదల కోసం వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ దసరా సెలవులు సమయంలో విడుదల కావడంతో సినిమా థియేటర్లలో రికార్డు వసూళ్లు వచ్చే అవకాశముంది. టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్డ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ భారీ హైప్, మాస్ అట్రాక్షన్‌తో బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కానీ, మరోవైపు పెరిగిన టికెట్ ధరలు కుటుంబ ప్రేక్షకులకు భారం అయ్యే అవకాశం ఉన్నదన్న ఆందోళన కూడా పరిశ్రమలో వినిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్, మంత్ ఎండ్ సమయంలో ఈ టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకర్షిస్తాయో చూడాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Guns N Roses Song: ఓజీ మూవీ నుంచి మతిపోగొట్టే సాంగ్ రిలీజ్‌.. 'గన్స్ ఎన్ రోజెస్'లో ఏం చూపించారంటే?
Recommended image2
ఓవర్సీస్ లో ఓజీ సెన్సేష‌న్.. రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved