పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఓజీ` మూవీ మరో పది రోజుల్లో విడుదల కాబోతుంది. తాజాగా `గన్స్ ఎన్‌ రోజెస్‌` పేరుతో మరో పాటని విడుదల చేశారు. ఇది ఆద్యంతం మతిపోగొట్టేలా ఉంది. 

`ఓజీ` నుంచి గన్స్ ఎన్‌ రోజెస్‌ సాంగ్‌ విడుదల

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న `ఓజీ` సినిమా గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇందులో పవన్ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించడం, విడుదలైన గ్లింప్స్ మతిపోగొట్టేలా ఉండటంతో సినిమాపై అందరి చూపు ఉంది. ఈ మూవీ మరో పది రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచారు. ఇటీవల వరుసగా కంటెంట్ ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా `ఓజీ` నుంచి మరో పాట వచ్చింది. `గన్స్ ఎన్‌ రోజెస్‌` పేరుతో సాగే పాటని విడుదల చేశారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ లిరిక్ తో సాగే ఈ పాట మాత్రం అదిరిపోయేలా ఉంది.

`ఓజీ`పై అంచనాలను పెంచుతోన్న `గన్స్ ఎన్‌ రోజెస్‌` పాట 

ఇటీవల `ట్రాన్స్ ఆఫ్ ఓమి` పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో ఇమ్రాన్‌ హష్మీని పాత్రని పరిచయం చేశారు. ఇది సినిమాపై హైప్‌ని పెంచేసింది. తాజాగా విడుదలైన 'గన్స్ ఎన్ రోజెస్' గీతం ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ గీతం సినిమాలోని గందరగోళం, భావోద్వేగాలు, భారీ యాక్షన్‌ ని అన్వేషిస్తుంది. ఇది కేవలం పాట మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీర క్రూరమైన ప్రపంచాన్ని, అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసిందని చెప్పొచ్చు. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా ఈ సాంగ్‌ సాగడం విశేషం.

`ఓజీ` రిలీజ్‌ డేట్‌ 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ స్వరపరిచిన ఈ పాట.. శ్రోతలను 'ఓజీ' సినిమాకి సంబంధించిన ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళ్తుంది. తమన్ తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని సృష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన 'గన్స్ ఎన్ రోజెస్' పాట సినిమా కథలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఫ్యాన్స్ కి గూజ్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

త్వరలో `ఓజీ ` ట్రైలర్

'ఓజీ' చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారాయి. 'గన్స్ ఎన్ రోజెస్' గీతం కూడా అదే కోవలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. త్వరలో ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించబోతుంది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా, ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌లా ఉండబోతుందని సమాచారం.

YouTube video player