- Home
- Entertainment
- OG First Song: `ఓజీ` ఫస్ట్ సాంగ్ వచ్చింది.. ఎలా ఉందంటే?, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేనా?
OG First Song: `ఓజీ` ఫస్ట్ సాంగ్ వచ్చింది.. ఎలా ఉందంటే?, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేనా?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఓజీ` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. పవన్ పాత్రని ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట అదిరిపోయేలా ఉంది.

`ఓజీ`తో సందడి షురూ చేసిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవలే `హరి హర వీరమల్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన్నుంచి సినిమా వచ్చింది. పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా పవన్ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. అది ఆడియెన్స్ కి రీచ్ అయ్యింది. త్వరలో `ఓజీ`తో ఆయన సందడి చేయడానికి రాబోతున్నారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రాబోతున్నారు.
KNOW
`ఓజీ` ఫస్ట్ సాంగ్ వచ్చింది
పవన్ హీరోగా నటించిన `ఓజీ` మూవీ రెండు నెలల గ్యాప్‌తోనే రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతంలో గ్లింప్స్ విడుదల చేయగా, అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్‌తో ఈ సందడి షురూ చేస్తున్నారు. `ఫైర్‌స్టోమ్` పేరుతో సాగే ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. నిజానికి సాయంత్రం విడుదల చేయాల్సి ఉండగా, పాట లీక్ కావడంతో ముందే విడుదల చేశారు.
పవన్ పాత్రని ఆవిష్కరించేలా `ఫైర్‌స్టోర్మ్` సాంగ్
ఇక విడుదలైన పాట పవన్ కళ్యాణ్ పాత్రని ఆవిష్కరించేలా సాగుతుంది. ఎక్కువగా ఇంగ్లీష్ లిరిక్ తో సాగే పాట ఆద్యంతం ఆకట్టుకునేలా, పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటని విశ్వ, శ్రీనివాస్ మౌలి రాయగా, హీరో శింబు, థమన్, నజీరుద్దీన్, భరత్‌రాజ్, దీపక్ బ్లూ ఆయా భాషల్లో ఆలపించారు. ఫీమేల్ వెర్షన్ రాజ కుమారి పాడారు. ఇంగ్లీష్ లిరిక్‌ని కూడా ఆమెనే రాయడం విశేషం. ఓ వైపు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలివేషన్లు, మరోవైపు కథని ప్రతిబింబించేలా యాక్షన్‌తో ఈ పాట సాగింది. ఆద్యంతం స్టయిలీష్‌గా పాట ఉండటం విశేషం.
The moment when our #OG went into
‘Evadosthado Randraa’ mode 🔥https://t.co/N79LBFMKyQ#TheyCallHimOG#FireStormpic.twitter.com/QEkk1pqc9F— DVV Entertainment (@DVVMovies) August 2, 2025
`ఓజీ` కాస్ట్ అండ్ క్రూ
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి నెగటివ్ రోల్ చేశారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, వెంకట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్‌లో `ఓజీ`
ముంబాయి మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుంది. పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇలా పూర్తి స్థాయిలో గ్యాంగ్ స్టర్ తరహా సినిమాని పవన్ చేస్తున్నారు. `పంజా`, `బాలు` వంటి చిత్రాల్లో కొంత మాఫియా టచ్ ఇచ్చారు. కానీ `ఓజీ` పూర్తి మాఫియా గ్యాంగ్ స్టర్ మూవీ కావడం విశేషం. ఈ మూవీపై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు, ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ `ఓజీ ఓజీ` అంటూ అరుస్తోన్న విషయం తెలిసిందే. `హరి హర వీరమల్లు` ఈవెంట్లలోనూ, పొలిటికల్ ఈవెంట్లలోనూ ఇదే పదం వాడుతూ వస్తున్నారు. ఈ చిత్రం కోసం వారంతా ఎంతో ఆతృతగా ఉన్నారు. దర్శకుడు సుజీత్ కూడా ఈ మూవీని ఆద్యంతం స్టయిలీష్ గ్యాంగ్‌స్టర్ మూవీగా తెరకెక్కించినట్టు సమాచారం. పవన్ పవర్‌ని ప్రతిబింబించేలా ఆయన పాత్రతోపాటు సినిమా ఉంటుందని, పూర్తి ఫ్యాన్ బాయ్ మూమెంట్‌తో మూవీని తెరకెక్కించారని సమాచారం. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Here is #FireStrom 🔫💥🙌🏿 From #TheyCallHimOGFirstSingle
Our Respect & love To Our Beloved Leader Shri #Powerstar@PawanKalyan gaaru 🧿💫https://t.co/0U46eNse1M
Volume uP 🤟🏽🤟🏽
Blast 💥 it 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥@Sujeethsign@DVVMovies#OGFirstSingleBlast— thaman S (@MusicThaman) August 2, 2025