- Home
- Entertainment
- ఎంత మంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా చెక్కుచెదరని ఎన్టీఆర్ ఆ రికార్డు, 60ఏళ్లుగా పదిలం
ఎంత మంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా చెక్కుచెదరని ఎన్టీఆర్ ఆ రికార్డు, 60ఏళ్లుగా పదిలం
ఎన్టీ రామారావు 1965లో క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా ఆ రికార్డుని టచ్ చేయలేకపోయారు. ఆ కథేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ రామారావు తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చిన నటుడు. ఏఎన్నార్‌తో కలిసి ఆయన ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో చేశారు. మద్రాస్‌లో ఉన్న తెలుగు సినిమాని హైదరాబాద్‌కి తీసుకొచ్చింది ఆయనే.
ఇక్కడ విస్తరింప చేసింది, దానికి ఇండియా వైడ్‌గా గుర్తింపుని తీసుకొచ్చింది ఆయనే. అదే సమయంలో నటుడిగానూ ఆయన సంచలనాలు సృష్టించారు.
పౌరాణిక, జానపద, సాంఘీక, చారిత్రక చిత్రాలను తీసి మెప్పించారు. రాముడిగా, కృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పటికీ కీర్తించబడుతున్నారు.
ఎన్టీఆర్ రికార్డుని టచ్ చేయలేకపోయిన చిరు, కృష్ణ
ఎన్టీఆర్, ఎన్నార్ వంటి వారు అప్పట్లో ఏడాదికి పదికిపైగా సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. వారే కాదు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి వారు కూడా ఇలా ఏడాదికి పదికిపైగా చిత్రాలు చేశారు.
కృష్ణ ఇరవై, ముప్పై సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎంత మంది సూపర్ స్టార్లు, కృష్ణంరాజులు, చిరంజీవిలు వచ్చినా ఎన్టీఆర్ ఒక రికార్డుని మాత్రం కదపలేకపోయారు. దాదాపు ఆరవై ఏళ్ల క్రితం రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
మూడు షిఫ్ట్ ల్లో పనిచేసిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ 1949లో సినిమా పరిశ్రమలోకి వచ్చారు. `మనదేశం` చిత్రంలో నటించారు. ఆ మూవీతో ఆయన జర్నీ ప్రారంభమైంది. ప్రారంభంలో తెలుగు, తమిళంలో సినిమాలు చేశారు.
ఏక కాలంలో రెండు భాషల్లో సినిమాలు రూపొందేవి. ఆ తర్వాత తెలుగులో మాత్రమే సినిమాలు చేశారు. అప్పట్లో మూడు షిఫ్ట్ ల్లో మూవీస్ చేసేవారు. అయితే వాటిని చాలా వరకు సెట్ లోనే షూటింగ్ జరిపేవారు. స్టూడియోల్లోనే షూట్ చేసేవారు.
దీంతో ఒకేరోజు మూడు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనేవారు. అదే సమయంలో ఒక్కో మూవీ నెల రోజుల్లోనే కంప్లీట్ అయ్యేది. అలా ఏడాదికి ఇరవై, ముప్పైకిపైగా చిత్రాల షూటింగ్‌లో పాల్గొనేవారు.
1965లో 12 సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చిన రామారావు
ఈ క్రమంలో ఏడాదికి పదికిపైగా సినిమాలు విడుదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నెల ఒక సినిమా విడుదలయ్యేది. కొన్నిసార్లు ఒకేవారం ఒక హీరోకి సంబంధించిన రెండు చిత్రాలు విడుదలయ్యేవంటే అతిశయోక్తి కాదు.
అయితే 1965లో ఎన్టీఆర్ నుంచి ఏకంగా 12 సినిమాలు విడుదలయ్యాయి. ఈ లెక్కన ప్రతి నెల ఒక సినిమా రిలీజ్ అయ్యిందని చెప్పొచ్చు. అంతకు ముందు 15కుపైగా చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ 1965లో మాత్రం ఒక రికార్డు ఉంది.
ఈ ఏడాది 12 సినిమాలు విడుదలైతే అందులో 12 చిత్రాలు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టడం విశేషం. ఈ మూవీస్‌లో 8 వంద రోజులకుపైగా ప్రదర్శించబడ్డాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.
12 సినిమాలకు 12 హిట్
ఆ సినిమాలేంటనేది చూస్తే, `నాదీ ఆడజన్మే`, `పాండవవనవాసము`, `మంగమ్మశపథం`, `తోడూ నీడా`, `దేవత`, `వీరాభిమన్యు`, `సిఐడి`, `ఆడబ్రతుకు` వంటి సినిమాలు ఏకంగా వందరోజులు ఆడాయి, కలెక్షన్ల పంట పండించాయి.
వీటితోపాటు `దొరికితే దొంగలు`, `సత్యహరిశ్చంద్ర` చిత్రాలు ఎబౌ యావరేజ్‌గా ఆడాయి. `ప్రమీలార్జునీయం`, `విశాల హృదయాలు` సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. అయితే ఈ 12 సినిమాలు నిర్మాతలకు లాభాలు తెచ్చాయి.
ఒక్క నిర్మాత కూడా నష్టపోలేదు. అంటే 12కి 12 హిట్ అనే చెప్పొచ్చు. ఈ ఘనత మరే హీరోకి దక్కలేదు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేసినా ఇలా వంద శాతం సక్సెస్ ఎవరికీ దక్కలేదు. ఆ రికార్డు రామారావు పేరుమీదనే ఉండిపోవడం విశేషం.