- Home
- Entertainment
- ఎన్టీఆర్ ప్లాన్ బెడిసికొడుతుందా? అనుకున్నదొక్కటి, అవుతుందొక్కటి?.. సీన్ రివర్స్ తో ఫ్యాన్స్ ఆందోళన ?
ఎన్టీఆర్ ప్లాన్ బెడిసికొడుతుందా? అనుకున్నదొక్కటి, అవుతుందొక్కటి?.. సీన్ రివర్స్ తో ఫ్యాన్స్ ఆందోళన ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. కానీ ఆయన నెక్ట్స్ సినిమాల లైనప్పే ఇప్పుడు తేడా కొడుతుంది. ముందు ఒకలా ఉంది. ఇప్పుడు మరోలా మారిపోతుంది.

ఎన్టీఆర్(NTR) ఇమేజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR)తో ఆయన నేషనల్ స్టార్ అయిపోయారు. బాలీవుడ్‌లోనే కాదు, నార్త్ లోనూ చాలా మంది ఎన్టీఆర్‌ని ఇష్టపడుతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్ టైమ్‌లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. హీరోయిన్లయితే ఏకంగా Jr.Ntrతో నటించాలని ఉందని తమ మనసులోని మాటని వెల్లడించారు. తారక్ `ఆర్‌ఆర్‌ఆర్` రిజల్ట్ తర్వాత ఎంత సైలెంట్‌గా ఉన్నా, ఆయన ఇమేజ్ మాత్రం సైలెంట్‌గా పాకిపోతుందని అందరి నుంచి వినిపిస్తున్న మాట.
`ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్ భారీగా ఉందనే వార్తలు అంతకు ముందు వైరల్ అయ్యాయి. అరడజను సినిమాలని, నెక్ట్స్ పది సినిమాల లైనప్ అంటూ సోషల్ మీడియాలో, అలాగే అన్ని మీడియా మాధ్యమాల్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. నెక్ట్స్ ఎన్టీఆర్ అత్యంత బిజీయెస్ట్ యాక్టర్ కాబోతున్నారని అంతా భావించారు. అదే నమ్మకంతో ఉన్నారు. కానీ ఒక్క నిర్మాత స్టేట్‌మెంట్ ఇప్పుడు తారక్ లైనప్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతా ఆయోమయంలో పడేయడంతోపాటు ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది.
ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత కొరటాల శివ(Koaratala Siva)తో సినిమా చేయాల్సి ఉంది. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే కొరటాల తీసిన `ఆచార్య` డిజాస్టర్‌గా నిలవడంతో ఈ ప్రాజెక్ట్ పై కాస్త సందేహాలు కలుగుతున్నాయి. అదే సమయంలో ఆ క్రేజ్ తగ్గిపోయింది. పైగా `రాజమౌళి హీరోల నెక్ట్స్ సినిమాలు పరాజయం` అనే సెంటిమెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ ని కాస్త ఇబ్బంది పెడుతుంది. దీంతో ఈ `ఎన్టీఆర్ 30`పై బజ్ తగ్గిపోయింది. తారక్ కూడా దర్శకుడు కొరటాలకి `టైమ్ తీసుకున్నా ఫర్వాలేదు, కథ విషయంలో తేడా రాకుండా చూసుకోవాల`ని చెప్పినట్టు వార్తలు గుప్పుమన్నాయి. కొరటాల కథపై గట్టిగా కూర్చుంటున్నట్టు సమాచారం.
కొరటాల తర్వాత ఎన్టీఆర్.. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ని గతేడాదే అధికారికంగానూ ప్రకటించారు. మరోవైపు `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబుతోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది ఎన్టీఆర్. ఈ మూడు చిత్రాలను తారక్ ఫిక్స్ చేసుకున్నారు. దీంతోపాటు అట్లీతో ఓ సినిమా, త్రివిక్రమ్‌తో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగాతో, సంజయ్ లీలా భన్సాలీతో మరో సినిమా, ఇద్దరు తమిళ దర్శకులతో రెండు సినిమాలు, సుకుమార్‌తోనూ సినిమా అనే వార్తలు ప్రచారం జరిగాయి. ఇవేవి కమిట్ అయిన సినిమాలు కావు. జస్ట్ చర్చల దశలో ఉన్నావే. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ భారీగా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే ఇందులో అత్యంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవబోతుంది ప్రశాంత్ నీల్ సినిమా. `కేజీఎఫ్ 2`(KGF2)తో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శకుడి సినిమా అంటే పాన్ ఇండియాని మించి ఉండబోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదే ఆలోచనలో తారక్ అభిమానులున్నారు. కానీ ఇటీవల `కేజీఎఫ్ 2` నిర్మాత విజయ్ కిరగందూర్ చేసిన ప్రకటన మొత్తం సీన్ రివర్స్ చేసింది. అనుకున్నదొక్కటి, అవుతుందొక్కటి అనేలా మార్చింది. విజయ్ కిరగందూర్ చెబుతూ, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న `సలార్` ఈ ఏడాది నవంబర్‌లో పూర్తవుతుందని, ఆ తర్వాత `కేజీఎఫ్ 3` స్టార్ట్ అవుతుందన్నారు.
ఈ స్టేట్‌మెంటే తారక్‌ని టెన్షన్ పెడుతుంది. మరి ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా ఎప్పుడుంటుందనేది ప్రశ్నగా మారింది. ప్రశాంత్ నీల్‌తో సినిమా తనకు మరో నెక్ట్స్ లెవల్ ప్రాజెక్ట్ అవుతుందని భావించారు తారక్. ఇప్పుడు అది మరో రెండేళ్లు టైమ్ పట్టే ఛాన్స్ ఉండటంతో తన ఆశలన్నీ అడియాశలుగా మారిపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ వైపు అనేక కారణాలతో కొరటాల సినిమాపై బజ్ తగ్గింది. బుచ్చిబాబుతో సినిమా ఓ ప్రయోగాత్మకంగా ఉంటుందని టాక్. వీటి రిజల్ట్ ని విడుదలయ్యేంత వరకు ఊహించడం కష్టం.దీంతో ఎన్టీఆర్ కాస్త సందిగ్దంలో పడ్డారని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే ప్రశాంత్‌నీల్‌నే ఎన్టీఆర్ గట్టిగా నమ్ముకున్నారు.
మరి తనతో ఉన్న కమిట్‌మెంట్‌ని వదిలేసి, ప్రశాంత్‌నీల్ `కేజీఎఫ్ 3` కోసం ఎన్టీఆర్ వదిలేస్తాడా? ఆయన కోసం మరో ఏడాది వెయిట్ చేస్తాడా? లేక కచ్చితంగా చేయాల్సిందే అని పట్టుపడతారా? తెరవెనుక ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. దీని కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20. ఆ రోజు నెక్ట్స్ సినిమాలకు సంబంధించి, అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.