MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR New Look:కసరత్తులు మొదలెట్టిన ఎన్టీఆర్, కొరటాల సినిమా కోసం న్యూ లుక్

NTR New Look:కసరత్తులు మొదలెట్టిన ఎన్టీఆర్, కొరటాల సినిమా కోసం న్యూ లుక్

ఆర్ఆర్ఆర్ సందడి అయిపోయింది, ఇక తమ నెక్ట్స్ సినిమలపై దృష్టి పెట్టారు చరణ్ , తారక్. చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ కొరటాల సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈసినిమా కోసం న్యూ లుక్ లో మెరవబోతున్నాడు తారక్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2022, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కొరటాలతో సినిమాను ఎన్టీఆర్  ఎప్పుడో స్టార్ట్ చేయాల్సి ఉంది. కాని ఈసినిమా ఓపెనింగ్ రకరకాల కారణాల వల్ల డిలై అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే నెల ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సినిమా రెగ్యూలర్ షూటింగ్ వరకూ తారక్ తన శరీరాన్ని మార్పులు చేసుకోబోతున్నట్టు సమాచారం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష స్వీకరించారు. రీసెంట్ గా  21 రోజుల హనుమాన్ దీక్షను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కబోయే తన  30వ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు ఎన్టీఆర్. దానికోసమే జిమ్ ట్రైనింగ్ కోసం రెడీ అవుతున్నారు. 

38

కొరటాల సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతోందట. దాని కోసం ఆయన జిమ్ చేసి బరువు తగ్గి.. సినిమాకు తగ్గట్టు మార్చుుకోబోతున్నట్టు తెలుస్తోంది.  అందుకే  తారక్ ఇప్పటికే జిమ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే   కసరత్తులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

48

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఫిట్ గా  కనిపించిన ఎన్టీఆర్.. సినిమా షూటింగ్ తరువాత చాలా రోజులు గ్యాప్ రావడంతో  కాస్తంత ఒళ్లు చేశాడు. తన 30వ ప్రాజెక్టు కోసం ఇప్పుడు బరువు తగ్గించుకునే కసరత్తులు చేయనున్నట్టు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.  

58

 అయితే  ఎన్టీఆర్ స్పెషల్ లుక్ కోసం ఫేమస్ ఫిట్ నెస్ ట్రైయినర్ ను కూడా ఆయన ఇప్పటికే అపాయింట్ చేసుకున్నాడట. ట్రైయినర్  ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్క్ అవుట్స్ చేస్తున్నారట. ఈ సారి ఎలాంటి కొత్త లుక్ లో తారక్ దర్శనం ఇస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 
 

68

ఎన్టీఆర్ 30వ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా కొరటాల శివ తెరకెక్కించనున్నారు. జూన్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. మాస్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ మిక్సింగ్ తో  ఈ సినిమా ఉంటుందని కొరటాల శివ రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 

78

సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా ఎన్టీఆర్ రెడీగా ఉంటారు.  పాత్ర డిమాండ్ ను బట్టి.. ఎలాంటి  కసరత్తులు చేయడానికైనా వెనకాడరు తారక్. ఆర్ఆర్ఆర్ కోసం ఇంతే కష్టపడ్డాడు. ఇప్పుడు కొరటాల సినిమా కోసం కూడా  ఇదే కమిట్ మెంట్ తో పనిచేయబోతన్నాడు ఎన్టీఆర్.

88

ఇక ఈసినిమాలో హీరోయిన్ పై క్లారిటీ రాలేదు.  ముందుగా ఆలియా భట్ అనుకున్నా.. ఆమెకు రణ్ బీర్ తో పెళ్లి కావడంతో ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రష్మికతో పాటు కీర్తి సురేష్ పేరు ఈసినిమా కోసం వినిపిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
Recommended image2
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Recommended image3
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved