MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆరేళ్ల తర్వాత వస్తున్న, నర్వస్‌గా ఉంది, ఎన్టీఆర్‌ నుంచి ఊహించని కామెంట్స్, 40 నిమిషాలు గూస్‌బంమ్స్

ఆరేళ్ల తర్వాత వస్తున్న, నర్వస్‌గా ఉంది, ఎన్టీఆర్‌ నుంచి ఊహించని కామెంట్స్, 40 నిమిషాలు గూస్‌బంమ్స్

`దేవర` సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆరేళ్ల తర్వాత వస్తున్నా, నర్వస్‌గా ఉందని చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ ని మరింత కలవరానికి గురి చేస్తుంది.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 10 2024, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి మల్టీస్టారర్ తర్వాత ఇప్పుడు సోలో హీరోగా వస్తున్నాడు. ఆయన `దేవర` సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన మూవీ ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో `జనతా గ్యారేజ్‌` సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు `దేవర` సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా విజయం ఇటు కొరటాలకి, అటు ఎన్టీఆర్‌ చాలా ముఖ్యం. కొరటాల గత చిత్రం `ఆచార్య` దారుణంగా డిజప్పాయింట్‌ చేసింది. దీంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శలకు సమాధానం చెప్పాలి, తాను పుంజుకోవాలి. కాబట్టి ఈ మూవీ హిట్‌ ఆయనకు చాలా ముఖ్యం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ అప్‌ డేట్స్, ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం ఇక్కడ చూడండి.
 

25

మరోవైపు ఎన్టీఆర్‌కి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్‌. ఆయన చివరగా సోలో హీరోగా `అరవింద సమేత` చిత్రంలో నటించారు. ఇది బాగానే ఆడింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ కాదు. ఆ తర్వాత వచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మల్టీస్టారర్‌ కావడంతో, పైగా అది రాజమౌళి సినిమా కావడంతో ఆ క్రెడిట్‌ అంతా ఆయనే తీసుకెళ్లారు.

దీనికితోడు ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తుంది. ప్రభాస్‌, బన్నీ, చరణ్‌, మహేష్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా ఆ లీగ్‌లో ఉండాలంటే `దేవర` కచ్చితంగా పెద్ద హిట్‌ కావాల్సిందే. 
 

35

తాజాగా `దేవర` ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ ఆకట్టుకుంది. కానీ సినిమా కథేంటో ట్రైలర్‌లో చెప్పేశాడు దర్శకుడు. ఇదే అసలు క అయితే అది రొటీన్‌గానే ఉందనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కథ ఇదే అయితే సినిమా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ కామెంట్స్ మరింత ఆందోళనకి గురి చేస్తున్నాయి.

మంగళవారం ముంబయిలో ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో తారక్‌ మాట్లాడుతూ, ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్నా అని, చాలా నర్వస్‌గా ఉందని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీతో చివరగా వచ్చాను. అందులో రామ్‌ చరణ్‌ మరో హీరో. ఇప్పుడు సోలో హీరోగా `దేవర` సినిమా చేస్తున్నా. ఆరేళ్ల తర్వాత సోలోగా నా మూవీ వస్తుందంటే కాస్త నర్వస్‌గా ఉందని చెప్పారు ఎన్టీఆర్‌. 
 

45

మరోవైపు ఈ సందర్భంగా గూస్‌బంమ్స్ తెప్పించే విషయాన్ని వెల్లడించారు. సినిమాలో 40 నిమిషాలు రాక్‌ అని, పూనకాలు తెప్పించేలా ఉంటుందన్నారు. దానికోసం తాను ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని చెప్పారు. ఆయా సీన్లని దర్శకుడు కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారని, విజువల్స్ వండర్‌గా ఉంటాయని, అదొక ట్రీట్‌లా ఉంటుందన్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్ స్పెషల్‌ హైలైట్‌గా ఉంటాయని వెల్లడించారు ఎన్టీఆర్‌. 

`దేవర` చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న పాన్‌ ఇండియారేంజ్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్‌ విజయాన్ని సాధిస్తుందో చూడాలి. 
 

55

ఇక ఈ మూవీని ఓ బ్యాడ్‌ సెంటిమెంట్‌ వెంటాడుతుంది. రాజమౌళితో సినిమా చేశాక ఏ హీరోకైనా పరాజయాలే ఎదురయ్యాయి. `ఆర్‌ఆరఆర్‌` తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు ఆయనకి ఈ మూవీతో ఫ్లాప్‌ పడుతుందా? ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ `దేవర`ని వెంటాడుతుందా? లేక ఆ సెంటిమెంట్‌ని ఈ మూవీ బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి.

ఎందుకంటే `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రామ్‌ చరణ్‌కి `ఆచార్య` రూపంలో పరాజయం ఎదురయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. దీంతో `దేవర` విషయంలో ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. పైగా ట్రైలర్‌ విషయంలో కొరటాల శివ చేసిన పని మరింత టెన్షన్‌ కి గురి చేస్తుంటే, ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం నర్వస్‌గా ఉందని చెప్పడం గమనార్హం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved