- Home
- Entertainment
- RRR Pre Release Event: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ.. ముంబయిలో రామ్, భీమ్ భారీ కటౌట్లు
RRR Pre Release Event: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ.. ముంబయిలో రామ్, భీమ్ భారీ కటౌట్లు
ఇండియన్ ప్రస్టీజియస్ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్`. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో వస్తోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముంబయిలో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిలకు గ్రాండ్ గా స్వాగతం పలకడం విశేషం. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి `ఆర్‌ఆర్ఆర్` చిత్రాన్నిరూపొందించిన విషయం తెలిసిందే. రెండు లెజెండరీ పాత్రలను తీసుకుని ఫిక్షనల్ కథాంశంతో అల్లూరి, కొమురంభీమ్ కలిసి స్నేహితులుగా బ్రిటీష్‌పై చేసిన పోరాటం నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం సాగనుంది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ కథానాయికలుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
`ఆర్‌ఆర్‌ఆర్` ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగని వారం రోజుల ముందే తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కేరళాలో ప్రెస్‌మీట్లు నిర్వహించారు. సినిమాపై హైప్ పెంచారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల హోరు స్టార్ట్ చేశారు. మొదటగా ముంబయిలో ఫస్ట్ `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్` తారలు సందడి చేశారు.
అయితే ఆ ఈవెంట్‌లో మన స్టార్స్ కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఇలాంటి గ్రాండ్ వెల్‌కమ్ మరే ఈవెంట్లలోనూ జరగలేదనిపిస్తుంది. ఎన్టీఆర్, చరణ్‌లను, అలాగే రాజమౌళిని గన్‌ఫైర్స్, ఫైరింగ్‌లతో స్వాగతం పలకడం విశేషం.
ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి, అలియాభట్ ముంబయికి చేరుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ లో వీరు దిగిన సెల్ఫీ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈవెంట్‌లో కరణ్ జోహార్, సంగీత దర్శకుడు కీరవాణి వంటి వారు పాల్గొన్నారు.
ముఖ్యంగా ముంబయి ఈవెంట్ కి ఊహించినట్టే కండలవీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ గా హాజరయ్యారు. సందడి చేశారు. ఈవెంట్‌కి మరింత హైప్ తీసుకొచ్చారు.
అంతేకాదు ముంబయిలో తెలుగు హీరోల కటౌట్లు సందడిచేస్తున్నాయి. జనరల్‌గా మన దగ్గర సినిమా విడుదల టైమ్‌లో కటౌట్లు పెడతారు. అదికూడా పెద్ద హీరోలకే ఉంటుంది. కానీ ఇప్పుడు ముంబయిలో మన తెలుగు హీరోల కటౌట్లు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అల్లూరి గెటప్‌లో ఉన్న రామ్‌చరణ్, కొమురంభీమ్ గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ కటౌట్లు `ఆర్‌ఆర్‌ఆర్` ముంబయి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. ఇవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`ఆర్ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కరణ్ జోహార్, రామ్‌చరణ్, సల్మాన్ ఖాన్, అలియాభట్, శ్రియా, రాజమౌళి వంటి వారు సందడి చేశ